ఈరోజు నుండి 10 రోజులు. నేను, నా భార్య… నా పిల్లలు వచ్చి కూర్చుంటాం. ఎంక్వైరీ జరగాల్సిందే… నన్ను, నా కుటుంబ సభ్యులను దొంగల్లాగ చూపించి అవమానించిన పేర్ని నాని, అధికారులు సీతారామాంజనేయులు, ప్రసాదరావు, డీటీసీ, వర్క్ ఇన్స్పెక్టర్లను ఎవరినీ వదలను అంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
మమ్మల్ని వేధించారని, గత 5 సంవత్సరాల పాలనలో రవాణా శాఖ అధికారులు మా ట్రావెల్స్ ను ఇబ్బందిపెట్టారని… అరెస్ట్ చేసి జైలుకు పంపారన్నారు. మీకు భార్య బిడ్డలు లేరా… అంటూ ఆవేదనతో కన్నీళ్లు పెట్టారు.
నేను సీఎం చంద్రబాబును ఏమీ అనటం లేదని… గౌరవిస్తానని కానీ వాళ్లను మాత్రం వదలనన్నారు. నాతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందనుకుంటే పార్టీకి రాజీనామా అయినా చేస్తా కానీ వారిని మాత్రం వదలను అంటూ కన్నీరు పెట్టుకుంటూ వార్నింగ్ ఇచ్చారు. మీకు పిల్లలు లేరా… మా పిల్లలను ఎంత హింసించారో ఎలా మర్చిపోతాను అంటూ మండిపడ్డారు.
నా కొడకల్లారా… అరేయ్ శివప్రసాద్… మీరు ప్రభుత్వ ఉద్యోగులు కారా… నేను నా భార్య పిల్లలు బయట తిరగలేకపోతున్నాము. మీ వల్లే… నరుకుతా అని హెచ్చరించారు. నేను తప్పు మాట్లాడుతుండొచ్చు కానీ డీటీసీ కి ఫ్యామిలీ లేదా అని మండిపడ్డారు. బ్రేక్ ఇన్స్పెక్టర్లు నా బస్సులను రిపేర్లు చేసి పెట్టాల్సిందేనన్నారు. పేర్ని నాని సహా ఆనాడు ఇబ్బందిపెట్టిన అధికారులపై తీవ్ర పదజాలంతో విరుచుకపడ్డారు.
సజ్జల గాడు, పేర్ని నాని గాడు చెప్తే చేస్తారా… అరేయ్ పేర్నినానిగా తూ అంటూ మండిపడ్డారు.