ఒకప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండేవారో కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకుడు అంటే మొదట ప్రజల్ని మభ్యపెట్టాలి. అసాధ్యమైన విషయాల్ని సుసాధ్యం చేస్తామని వారిని నమ్మించాలి. రాజకీయలబ్ది పొందాలి. అధికారం అందిన తర్వాత వారు ఎలాగూ నోరు తెరవకుండా చేసే టెక్నిక్‌లు ఉంటాయి. ఇలా ఉంటే తప్ప రాజకీయనాయకుడిగా గెలవలేమనుకుంటున్న వారు .. ఈ దారిలోకి వచ్చేస్తున్నారు. తమ బెస్ట్ అన్నట్లుగా పర్ ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ జాబితాలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ చేరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూరుస్తామని ఆయన బిడ్ దాఖలు చేశారు. ఎలా అంటే.. క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. ఏపీలో ఉన్న ఒక్కొక్కరు… ప్రతి నెలా వంద ఇవ్వాలట. జేడీ మాటలు విని నవ్వుకోవడం అందరి వంతు అయింది.. కానీ ఆయన రాజకీయ తెలివితేటలకు మాత్రం ఆశ్చర్యపోతున్నారు జరగదని తెలిసి కూడా ఇంతా కన్ఫిడెంట్ గా బిడ్ దాఖలు చేయడమే కాదు.. ర్యాలీలు గట్రా నిర్వహించి స్టీల్ ప్లాంట్ ను బిడ్డలా కాపాడుకోవాలని ఆయన చెబుతున్నారు. ఇక్కడ అసలు లాజిక్ వేరే ఉంది. అసలు స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చితే స్టీల్ ఇస్తారు.. మరి ఆ స్టీల్ ను జేడీ ఏం చేస్తారు.? విరాలిచ్చిన వారికి పంపుతారా ?
అసలు జేడీకి బిడ్డింగ్ వేసే అర్హత లేదు. ఏ బిడ్‌లో పాల్గొనాలన్నా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ లో ప్రధానంగా ఉండేది.. ఆ రంగంలో అనుభవం.. లేకపోతే ఆర్థిక శక్తి. జేడీదగ్గర రెండూలేవు. ముడి సరుకు లేదు. ముడి సరుకు గనులు లేవు. అంతకు మించి డబ్బులు లేవు. మరి బిడ్ కు ఎలా అర్హత సాధిస్తారు ? అలాంటి చాన్స్ లేదు. కానీ జేడీ ఇప్పుడు తానుపూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని ఆయ్యానని ప్రజల ఎదుట నిలబడుతున్నారు. ఆయన నిజాయితీగా ఉన్నప్పుడు గెలిపించలేదు.. మరి ఇప్పుడు మభ్య పెట్టేందుకు రెడీ అయ్యారు… ఇప్పుడు గెలిపిస్తారేమో చూడాలి. విశాఖ నుంచి ఎంపీ అవ్వాలనుకుంటున్న ఆయన కోరిక తీరుతుందేమో వెయిట్ చేయాలి.