జగిత్యాల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన విధానం.. ఆ పార్టీలో అలజడికి కారణం అవుతోంది. జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతు దారు. పీసీసీ చీఫ్ ఎంపిక సమయంలో సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధి బృందానికి చాలా మంది రేవంత్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా జీవన్ రెడ్డి మాత్రం మద్దతుగా మాట్లాడారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇస్తే పార్టీ బలపడుతుందని చెప్పారు.
తన సీనియార్టీని గుర్తించి ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుకున్నారు. ఎంపీగా పోటీ చేయమన్నా చేశారు. అయితే ఇప్పుడు హటాత్తుగా తన నియోజకవర్గంలోనే తనకు ఎర్త్ పెట్టడంతో ఆయన అవమానానికి గురయ్యానని ఫీలవుతున్నారు. పదేళ్లుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పోరాడానని తనకు తెలియకుండా ఆయనను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని ఆయన ఆవేదన . కనీస సమాచారం లేకుండా.. మీడియాలో వచ్చిన తర్వాతే ఆయన తెలుసుకోవాల్సి వచ్చింది. సహజంగానే ఇది ఆయనను అవమానించినట్లు అవుతుంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పలువురు బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పరాజయం పాలయ్యారు. ఇప్పుడు అవసరం లేరని ఆకర్ష్ తో రేవంత్.. నమ్ముకున్న నేతల్ని ఇబ్బంది పెడుతున్నరాని అంటున్నారు.