నటి జీవిత పై ఓ మహిళా సంఘం నాయకురాలు మహా టీవీ లైవ్ లో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాజశేఖర్ దగ్గరకు అమ్మాయిల్ని పంపేది జీవితే అని.. అమీర్ పేట్ హాస్టల్ లో ఉన్న అమ్మాయిల్ని ఇందుకోసం వాడుకున్నారని అభియోగాలు మోపిన సంగతి విదితమే. వీటిపై జీవిత ఫైర్ అయ్యింది. ‘ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు..’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ‘టీఆర్ పీ రేటింగుల కోసం చర్చా వేదికలు పెట్టి ఏది పడితే అది మాట్లాడతారా? మేం గాజులు తొడుక్కుని కూర్చున్నామా? పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా’ అంటూ నిప్పులు చెలరేగారు. జీవిత చేసిన కామెంట్లు… సంధించిన ప్రశ్నలు క్లుప్తంగా..
- * శ్రీరెడ్డి కి ఏం కావాలి? ఆమెకు పరిశ్రమ ఏం ఇవ్వలేదు..? అది మీడియాకైనా తెలుసా?
- * సంధ్య అనే సోషల్ యాక్టివిటిస్ట్ లైవ్‌లో నా ప్రస్తావన తీసుకొచ్చి, రాజశేఖర్ కి అమ్మాయిల్ని జీవితే సప్లయ్ చేస్తుందని అన్నట్టు మాట్లాడారు. ఓ ఆడదాని కోసం మరో ఆడది ఇంత చీప్ ఎలిగేషన్స్ ఎలా చేసింది? ఎందుకు చేసింది?
- * నేనో గౌరవ ప్రదమైన కుటుంబంలో బతుకుతున్నా. నా భర్త ఓ డాక్టర్. నాకు ఇద్దరు కూతుర్లున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ కుటుంబం నుంచి వచ్చినదాన్ని నా గురించి ఏం తెలుసని, ఏ ధైర్యంతో ఈ ఆరోపణలు చేసింది?
- * ఈ న్యూస్ ప్రసారం చేసిన మహా న్యూస్ ఛానల్‌పై కూడా దావా వేస్తా. ఈ విషయం తేలే వరకూ నిద్రపోను
- * నాలుగేళ్ల క్రితం ఈ విషయం జరిగిందని చెబుతున్నారు…. ఈ విషయమై అప్పుడే ఎందుకు నిలదీయలేదు?
- * అప్పులు చేసి, ఆస్తులు అమ్మి సినిమాలు తీస్తాం. ఎవరివల్ల బిజినెస్ జరుగుతుందో వాళ్లనే సినిమాల్లోకి తీసుకుంటాం. ప్రతిభ ఉన్నవాళ్లే ఇండ్రస్ట్రీలో రాణిస్తారు.
- * మీడియేటర్ల వ్యవస్థ ప్రతీచోటా ఉంది. సినిమాల్లోనే కాదు.
- * సినిమా వాళ్లంటే లోకువ. కొత్త సినిమా వస్తోందంటే టికెట్ల కోసం అడుగుతారు. కానీ సినిమా వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడతారు?
- * ఓసారి మోసపోతారు.. రెండు సార్లు మోసపోతారు. పదేళ్లుగా మోసపోతే ఎవరి తప్పు. మీరేమైనా చిన్నపిల్లా..?
- * స్త్రీ ఉద్దరణ కోసం శ్రీరెడ్డి ఒక్కతే పాటు పడడం లేదు. ప్రపంచం మొత్తం ఇదే విషయంపై పోరాడుతోంది.
-
* అభిరామ్ ఫొటోలు బయటకు వచ్చాయి. బలవంతంగా ముద్దు పెట్టుకున్నట్టు లేవు కదా? సమస్య అభిరామ్ ది అయినప్పుడు తననే అడిగి
సమస్య నెరవేర్చుకదా? - * సినిమా వాళ్లపై ఇంత చీప్‌గా మాట్లాడుతుంటే సినిమా వాళ్లెవరూ స్పందించడం లేకపోవడం దారుణం. ఈ విషయమై సిగ్గు పడుతున్నా. జయప్రద, జయసుధ లాంటి వాళ్లంతా ఈ విషయమై స్పందించాలి. కనీసం ట్విట్టర్లో అయినా వాళ్ల వాదన వినిపించాలి.