కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తిరిగి తిరిగి… సినిమా వాళ్ల జీవితాలనే వీధిలోకి దించుతోంది. అసలు విషయం మానేసి… వాళ్ల వ్యక్తిగత జీవితాల్ని, నాలుగ్గోడల మధ్య సాగే రహస్యాల్ని బజారుకి ఈడుస్తోంది. కాస్టింగ్ కౌచ్‌లో ఓ మహిళా సంఘ నేత.. జీవితని కూడా బయటకు లాగింది. రాజశేఖర్ దగ్గరకు అమ్మాయిల్ని పంపేది జీవితనే అంటూ ఘాటైన విమర్శలు చేసింది. ఓ టీవీ షో లైవ్‌లోకి వచ్చిన మహిళా సంఘనేత ఉన్నట్టుండి జీవితపై విరుచుకుపడింది. తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ… ఉదంతాల్ని పూస గుచ్చినట్టు చెప్పింది. దీనిపై ఇప్పటి వరకూ జీవిత స్పందించలేదు. ఇప్పుడు మాత్రం ఓ ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈరోజు సాయింత్రం 5 గంటలకు జీవిత ఓ ప్రెస్ మీట్ పెట్టబోతోంది. ఇందులో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కత్తిమహేష్ సునీతపై నష్టపరిహారం దావా వేసినట్టు ప్రకటించాడు కదా? సేమ్ అదే సీన్ ఇక్కడా రిపీట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తన న్యాయవాదులతో మాట్లాడిన తరవాతే… జీవిత ఈ ప్రెస్ మీట్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జీవిత ఏం మాట్లాడినా, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. హాట్ న్యూసే అవుతుంది. మరి జీవిత స్టెప్ ఏంటో తెలియాలంటే సాయింత్రం వరకూ ఓపిక పట్టాల్సిందే.