నాని కథానాయకుడిగా నటిస్తున్న జెర్సీ ఈ నెల 19న విడుదల అవుతోంది. ఇదో క్రికెటర్ కథ. ప్రతిభ వున్నా, అదృష్టం లేక, పై స్థాయికి ఎదగలేకపోయిన ఓ రంజీ క్రికెటర్ కథ. టీజర్ చూడగానే ఈ సినిమా పై ఓ అంచనాకి వచ్చేసారు జనాలు. ప్రముఖ క్రికెటర్ రమణ్ లాంబా జీవిత కథకి ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుందన్న ఊహాగానాలు రేగాయి. వీటిపై నాని క్లారిటీ ఇచ్చాడు.
”అర్జున్ అనే ఓ క్రికెటర్ కథ ఇది. ఫిక్షన్ అనుకోవచ్చు. ఎవరి బయోపిక్ కాదు. కానీ అర్జున్ లాంటి కుర్రాడు నిజంగానే ఉన్నాడేమో అనిపిస్తుంది. క్రికెట్ అనేది కథ లో ఓ భాగం మాత్రమే. ఈ కథలో క్రికెట్ కంటే ఆసక్తికరమైన అంశాలు చాలా ఉంటాయి. ఇప్పటి వరకూ ఈ సినిమాని 20 సార్లు చూశా. చుసిన ప్రతీసారి నాకు కొత్తగా అనిపించింది. ఓ కథ విని తొలి సిట్టింగ్ లోనే ఓకే చేయడం ఈ సినిమాతోనే జరిగింది. క్లైమాక్ కంటతడి పెట్టిస్తుంది” అని జర్సీ గురించి ఓ క్లూ ఇచ్చాడు నాని.