తల్లి లేని ఆడపిల్లను కపూర్ కుటుంబం ఒంటరిగా వదల్లేదు. శ్రీదేవి కూతుళ్లను అక్కున చేర్చుకుంది. తమ కుటుంబంలో ఒక్కటి చేసుకుంది. శ్రీదేవి మరణం తర్వాత అందరిలో కలిగిన సందేహం ఒక్కటే… “ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీల పరిస్థితి ఏంటి?” అని! ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. మంగళవారం జాన్వీ కపూర్ పుట్టినరోజు. శ్రీదేవి మరణించిన కొద్ది రోజులకు వచ్చిన పుట్టినరోజు. అసలే అమ్మ పోయిన దుఃఖంలో వున్న జాన్వీ పరిస్థితి గురించి ఎక్కువమంది ఆలోచించారు. కపూర్ కుటుంబం అంతకంటే ఎక్కువ ఆలోచించింది. జాన్వీ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసింది. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో జాన్వీకి విషెస్ చెప్పిన సోనమ్ కపూర్, లేట్ నైట్ ఇంట్లో జరిగిన కేక్ కటింగ్ ఫోటోలను పోస్ట్ చేసింది. కపూర్ డాటర్స్ అంటూ ఇంట్లో అమ్మాయిలందరూ గ్రూప్ ఫోటోలు దిగారు. స్వర్గంలో వున్న శ్రీదేవి ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ చూసి కచ్చితంగా సంతోషించి వుంటుంది.