శ్రీదేవి వారసురాలు జాన్వి దృష్టి ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలపై పడిందా? అవుననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. తన తొలి చిత్రం ‘ధడక్’.. బాలీవుడ్లో చక్కటి వసూళ్లు రాబట్టుకుంటోంది. జాన్వి నటనకూ మంచి మార్కులే పడ్డాయి. శ్రీదేవి కుమార్తె అనే ట్యాగ్ లైన్ కూడా జాన్వికి బాగా కలిసొచ్చే అంశం. తెలుగులో శ్రీదేవికి వీరాభిమానులున్నారు. టాలీవుడ్‌తో శ్రీదేవి అనుబంధం ప్రత్యేకమైనది. నిజానికి జాన్వి ని తెలుగులోనే పరిచయం చేస్తారనుకున్నారు. కానీ.. ఆ ఆఫర్ బాలీవుడ్‌కి వెళ్లింది. ఎలాగూ బాలీవుడ్లో తొలి అడుగు దిగ్విజయంగా పడింది కాబట్టి… ఇప్పుడు సౌత్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. శ్రీదేవి కూతురుగా జాన్వికి తెలుగులో రెడ్ కార్పెట్ స్వాగతం దక్కడం ఖాయం. అయితే… మంచి బ్యానర్, స్టార్ దర్శకుడు అనే లెక్కల్లో ఉంది జాన్వి. ఆమెకు సంబంధించిన వ్యవహారాలన్నీ బోనీ కపూర్ చూసుకుంటున్నారు. `థడక్` ట్రైలర్ విడుదలైనప్పటి నుంచీ… బోనీకపూర్‌కి టాలీవుడ్ నుంచి సంప్రదింపులు బాగా పెరిగాయట. అయితే `థడక్` విడుదలైనంత వరకూ మరో సినిమా విషయం ఆలోచించనని బోనీ తేల్చి చెప్పేశారని, ఇప్పుడు ఎలాగూ రిలజ్ట్ వచ్చేసింది కాబట్టి… తెలుగు, తమిళ చిత్రాల్లో జాన్విని దింపడం ఖాయమని తెలుస్తోంది. మరి ఆ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.