జియో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంపై కన్నేసింది. టీవీ ఛానళ్లు, ఓటీటీ సంస్థల్ని గంప గుత్తగా దక్కించుకోవాలని భారీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా `స్టార్ మా`ని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ప్రస్తుతానికి స్టార్ మాకీ, జీయోకీ మధ్య చర్చలు సాగుతున్నాయి. జియో ఎప్పూడూ ఊరించే ప్యాకేజీలతోనే వస్తుంటుంది. స్టార్ మాకి ఈ ఆఫర్ చాలా టెమ్టింగ్ గా కనిపిస్తోందట. ఏ క్షణమైనా స్టార్ మా.. జియో చేతికి వెళ్లిపోవచ్చన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
థియేటర్ వ్యవస్థపై కూడా జియో దృష్టి సారించిందని సమాచారం. పీవీఆర్, ఏసియన్, జీవీకే లాంటి మల్టీప్లెక్స్ సంస్థల్ని.. జియో కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయి. అటు థియేటర్లు, ఇటు ఛానళ్లు, మరోవైపు ఓటీటీలూ.. ఇలా ఎక్కడ చూసినా జియోనే కనిపించడం ఒక్కటే లక్ష్యం. టెలికాం వ్యవస్థపై ఎలాగైతే.. గుత్తాధిప్యంగా ఆదిపత్యం చలాయిస్తుందో.. అలానే ఎంటర్టైన్మెంట్ రంగాన్ని గుప్పెట తీసుకోవాలని జియో విశ్వ ప్రయత్నం చేస్తోంది. వీటి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.