కొత్త సినిమా విడుదల రోజు.. మొదటి రోజు.. మొదటి ఆట చూడాలని… కోరుకోని.. సినీ హీరోల అభిమానులు ఎవరుంటారు..? టిక్కెట్ల కోసం.. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడే .. ఫ్యాన్స్‌కు మన దేశంలో కొదవేముంది..?. ఇలాంటి అభిమానుల వల్లే మల్టిప్లెక్స్‌లకు.. తొలి వారంలోనే కలెక్షన్ల వరద పారుతూంటుంది. కానీ.. ఈ వరదకు.. గండికొట్టి.. తమ ఖాతాలో వేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ… మాస్టర్ స్కెచ్ వేశారు. అదే.. “ఫస్ట్ డే .. ఫస్ట్ షో..”. అంటే.. సినిమా రిలీజ్ రోజే.. ఇంట్లో నుంచే.. మొదటి ఆటను… చూసుకునే అవకాశాన్ని కల్పించడం.
రిలయన్స్ ఇండస్ట్రీస్.. తన జియో బ్రాడ్ బ్యాండ్ సేలవను.. జియో గిగా ఫైబర్‌ను.. ప్రకటించింది. నెలవారీగా.. రూ. ఏడు వందల నుంచి.. రూ. పది వేల వరకు.. చందాలతో.. ఉండే సేవలను ప్రకటించింది. ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ కలిపి.. ఈ ప్లాన్లు అమలులో ఉంటాయి. వచ్చే నెల ఐదో తేదీ నుంచి… సర్వీసులను అందించబోతున్నట్లుగా.. రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇందుల “జియో ఫైబర్ ప్రిమియమ్” కస్టమర్ల కోసం “ఫస్ట్ డే .. ఫస్ట్ షో..”… ప్లాన్‌ను ప్రకటించారు. దీని ప్రకారం.. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా.. మొదటి ఆటను.. జియో ఫైబర్ ప్రిమియమ్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు.. చూసే అవకాశం ఉంది. ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుంది.
బ్రాడ్ బ్యాండ్ సేవల్లో.. సంప్రదాయంగా సేవలందిస్తున్న కంపెనీలను పాతాళంలోకి నెట్టేలా.. జియో గిగా ఫైబర్ ప్లాన్లు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే టెలికాలం రంగంలో.. యాభై శాతం మార్కెట్‌ను.. అతి తక్కువ కాలంలో సంపాదించుకున్న రిలయన్స్… ఇప్పుడు .. బ్రాడ్ బ్యాండ్‌లోనూ.. అదే తరహా ఏకచత్రాధిపత్యాన్ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. చిన్న చిన్న బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించే కంపెనీలు ఇక ఉనికి కాపాడుకోవడానికి తంటాలు పడాల్సిందే. దీన్ని చాలా మంది ఊహించారు కానీ.. సినిమా రిలీజ్ రోజునే… తొలి ఆటనే.. ఇంట్లోనే ఉండి చూసే.. స్కీమ్ ప్రారంభిస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. ఇది మల్టిప్లెక్స్‌ల బిజినెస్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే అంచనా ఉంది. కొసమెరుపేమిటంటే… మల్టిప్లెక్స్ అనుభూతి కోసం.. జియో గిగా ఫైబర్ తరపున.. టీవీలు, హెచ్డీటీవీ సెట్‌టాప్ బాక్సులు కూడా రిలయన్స్ ఫోన్ల తరహాలో ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు.