ఏఐ రాకతో ప్రపంచం ఉద్యోగ సంక్షోభం ఎదుర్కోక తప్పదా? రానున్న దశాబ్ద కాలంలో మధ్య తరగతి ప్రైవేట్ ఉద్యోగులు తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూడనున్నారా? శాలరీ వ్యవస్థ అంతరించే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ప్రపంచం పరుగులు పెడుతోన్న తరుణంలో వచ్చిన ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. విద్య, కస్టమర్, బిజినెస్ వంటి విభాగాల్లో ఇప్పటికే ఏఐ ఆధారిత ఆటోమేషన్ అందుబాటులో వచ్చింది. ఈ క్రమంలోనే ఉద్యోగ భద్రతపై కూడా సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఇండియాలో మధ్యతరగతి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉన్న శాలరీ వ్యవస్థ కనుమరుగవుతోందని ప్రముఖ పారిశ్రామిక వేత్త సౌరభ్ ముఖర్జియా ఇటీవల వెల్లడించారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఏఐ రాకతో ఉద్యోగ భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏఐ రాకతో రాబోయే రోజుల్లో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగిత రేట్ ఊహించని స్థాయికి ఎగబాకుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ డెవలపర్లు చేసే పనులను 70s శాతం ఏఐ చేయగలదు. దీంతో ఏఐ వినియోగం పెరిగితే సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగాలు చాలా తక్కువగానే ఉంటాయన్నారు ఒబామా.
విద్య, వైద్య రంగాల్లో మనిషి చేయగల వాటన్నింటిని ఏఐ భర్తీ చేస్తుందా? ఇదేనా అభివృద్ధి? ఇది ఆందోళనకరమైన అంశమని అంటున్నారు. AIరాకతో ఉద్యోగాల స్వరూపం మారుతుందని , అందుకే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగులు తమను తాము మార్చుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.