జగన్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే.. ఆయన తన నెత్తి మీద తాను చేయి పెట్టుకోవడం కాదు.. తనను నమ్ముకున్న వారి నెత్తిన కూడా చేయి పెట్టి వారి భవిష్యత్ ను భస్మం చేసే వరకూ ఊరుకోడు. ఇప్పుడు జోగి రమేష్‌కు అలాంటి అనుభవాన్నే జగన్ రూచి చూపించారు. అంతా అయిపోయాక ఇప్పుడు మైలవరం ఇంచార్జ్ గా ఆయనను ప్రకటించారు.
కాంగ్రెస్ లో ఉన్న నాటి నుంచి జోగి రమేష్ మైలవరం నుంచే పని చేసుకునేవారు. 2014లో జగన్ కడా మైలవరం టిక్కెట్ ఇచ్చారు. కానీ తర్వాత జోగి రమేష్ తో ఓ ఆటాడుకున్నారు. ఐదేళ్లు మైలవరంలో పని చేసకుంటే చివరి క్షణంలో పెడనకు పంపించారు. మైలవరాన్ని వసంత కృష్ణ ప్రసాద్ కు అప్పగించారు. వైసీపీ గాలిలో ఇద్దరూ గెలిచారు. అయితే తనకు మైలవరమే కావాలని జోగి రమేష్.. వసంతను ఇబ్బంది పెట్టారు. అయితే అలా ఇచ్చేస్తే జగన్ ఎందుకవుతారు ?
వసంత కృష్ణప్రసాద్ పార్టీ నుంచి వెళ్లిపోతారని తెలిసినా మైలవరం టిక్కెట్ ను జోగి రమేష్ కు ఇవ్వలేదు. అసలు సంబందం లేని పెనమలూరుకు పంపారు. మొత్తంగా అన్ని నియోజకవర్గాలు కొట్టుకుపోయాయి. మైలవరంలో జగన్ టిక్కెట్ ఇచ్చిన సర్నాల తిరుపతి రావు అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఆయన పార్టీ ఆఫీసును కూడా నిర్వహించలేక ఎత్తేశారు. దీంతో పరువు పోయినట్లయింది. చివరికి మళ్లీ జోగి రమేష్‌కే ఇంచార్జ్ బాద్యతలు ఇచ్చారు. పార్టీని సర్వనాశనం చేసేసిన తర్వాత ఇప్పుడు చాన్సిస్తే ఏం చేసుకోవాలని జోగి రమేష్ ఆవేదన. ఇంత చేసిన తర్వాత కూడా ఐదేళ్లు పని చేసుకుంటే చివరికి ఆయనకు టిక్కెట్ ఇస్తారో మరెక్కడికి పంపిస్తారో తెలియదు మరి !