మాజీ మంత్రి జోగి రమేష్ జైలు కోసం మానసికంగా రెడీ అయిపోతున్నారు. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని గంట గంటకూ బయపడటం కన్నా ఓ రెండు నెలల పాటు జైలుకు ఫిక్సయిపోతే పోతుంది కదా అనుకుంటున్నారు. అదే మీడియాకు చెబుతున్నారు. తనను మహా అయితే రెండు మూడు నెలలు జైల్లో పెట్టగలరని.. అంతకు మించి ఏమీ చేయలేరని అంటున్నారు. జోగి రమేష్ ఎందుకు ఇలా పిక్సయ్యారంటే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి మరి. అవి బయటపడటంతో .. వదిలి పెట్టే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చారు.
అగ్రిగోల్డ్ స్థలాన్ని డాక్యుమెంట్లు మార్చేసి అమ్మేసినట్లుగా తేలింది. ఎలా అమ్మారు.. ఎంతకు అమ్మారు.. సబ్ రిజిస్ట్రార్ తో ఎలా పని చేయించుకున్నారు.. అనే డీటైల్స్ తో సహా మొత్తం డీజీపీకి ఫైల్ చేరింది. ఇప్పుడు తదుపరి చర్యలు మిగిలి ఉన్నాయి. అలాగే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయన పేరును చేర్చారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇవి మాత్రమే కాదని ఆయన నిర్వాకాలు ఇంకా చాలా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏం చేసినా ఏం చేస్తారు.. మహా అయితే రెండు, మూడు జైల్లో ఉంచుతారనే మొండి ధైర్యానికి, మానసిక స్థితికి వైసీపీ నేతలు వచ్చారు. ఆ తర్వాత అయినా బయటకు వస్తామని తమ అక్రమ సంపాదన, కబ్జాలు అన్నీ తమ దగ్గరే ఉంటాయని వారు అనుకుంటున్నారు. జోగి రమేష్ కూడా అందులో ఒకరు. పదవుల కోసం ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకోవడం .. విపక్ష నేతలపై దాడులకూ వెరువకపోవడంతో ఇప్పుడు జోగి రమేష్ కు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.