మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ నేతలతో కలిసి నూజివీడులో ర్యాలీ నిర్వహించారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రవిష్కరణ అంటే కులపరమైన కార్యక్రమం కాదు. అలా అని హాజరయ్యానని చెప్పుకునే పరిస్థితి లేదు. జోగి రమేష్ టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వస్తున్నారు. ఇప్పుడు అది బహిరంగమయింది. వైసీపీకి కొంత కాలంగా దూరం పాటిస్తున్నారు. ఆయన కోరుకున్నట్లుగా మైలవరం ఇంచార్జ్ పదవిని ఇచ్చినప్పటికీ అక్కడ ఇప్పటి వరకూ అడుగు పెట్టలేదు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మెప్పు కోసం.. తాడేపల్లి నుంచి వచ్చిన సూచనల మేరకు అన్ని అడ్డగోలు పనులు చేశారు. ఈ కారణంగా ఆయన కుమారుడు జైలుకెళ్లాడు. ఆయన చుట్టూ అనేక కేసులు ఉన్నాయి. నేరుగా చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు. ఇంకా చాలా స్కాములున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక తట్టుకోలేనని ఆయన డిసైడైపోయి సైలెంటు అయిపోయారు. కూటమి పార్టీల్లో చేరేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మంత్రి పార్థసారధి సాయంతో మరో ప్రయత్నాలు చేస్తున్నారు.
జోగి రమేష్ వైసీపీలో అత్యంత ఘోరమైన నోరున్న నేతల్లో ఒకరు. జగన్ రెడ్డి పిలిచిపదవులు ఇస్తారని చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు. ఆయనకు జగన్ పదవికూడా ఇచ్చారు. దాంతో జోగి రమేష్ బావుకున్నదేమీ లేదు. కానీ అధికారం పోవడంతో కేసుల వలలో చిక్కుకున్నారు. ఆయన టీడీపీ నేతలతో కలిసి తిరిగినా కూటమి పార్టీల్లో ఏ పార్టీలోనూ ఆయనకు ఎంట్రీ లభించదని అంటున్నారు. అయితే ఆయనపై జగన్ ఇక విశ్వాసంకోల్పోవడం ఖాయమనేంటున్నారు. టీడీపీ నేతలతో కలిసి ర్యాల్లీ పాల్గొంటే ఏంటి అర్థమని వైీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.