జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ వాలంటీర్‌ని నిలబెట్టి, అతడ్ని ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు మంత్రి జోగి రమేష్. పవన్‌ని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎవరూ అవసరం లేదని, కేవలం వాలంటీర్ చాలన్నారు. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించే దమ్ము పవన్‌కి ఉందా? అని కూడా సవాల్ చేశారు. అయితే జోగి రమేష్ ఇక్కడ తన అతి తెలివితేటల్ని ప్రదర్శించారు. ఏమిటంటే..పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీచేస్తాననే సవాల్ స్వీకరించాలన్నారు.
పవన్ ఒంటరిగా పోటీ చేసినా.. పొత్తులతో పోటీ చేసినా.. వైసీపీకి సంబంధం లేని విషయం. కానీ.. పవన్ ను మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని అంటున్నారు. పవన్ ఒంటరిగా పోటీ చేయించాలనే తపనలో.. వైసీపీ నేతలు ఉన్నారు. ప్రతీ దానికి ఒంటరి పోటీ అనే లింక్ పెడుతున్నారు. తాము ఎంత భయపడుతున్నారో చెప్పకనే చెబుతున్నారు. పొత్తులకు పోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని పదేపదే సవాల్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర స్పీచ్‌లలో జగన్ ను ఏక వచనంతో టార్గెట్ చేసుకోవడాన్ని ఊహించలేకపోతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ షరతులు పెట్టుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ వైపు నుంచి ఇలాంటి ఎదురుదాడిని ఊహించలేకపోతున్నారు వైసీపీ నేతలు.