బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాన్నాళ్ళు కేసీఆర్ కు నీడలా నిలిచిన జోగినపల్లి సంతోష్ కుమార్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ కు కూడా దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ కు నీడలా నిలిచిన సంతోష్ ను కేసీఆర్ దూరం పెట్టారా? కేసీఆరే దూరం పెడితే ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఫోకస్ చేయని సంతోష్ కుమార్..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాలను చేపట్టడంపై పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కవిత అరెస్టు రాజకీయ ప్రేరేపిత చర్యేనని, బీజేపీ కేసీఆర్ ను ఎదుర్కోలేకే కవితను అరెస్టు చేయించిందని ఓ వైపు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు ఢిల్లీలో లిక్కర్ పాలసీ వ్యవహారాలను కేసీఆర్ కు చెరవేయకుండా కవిత అరెస్టుకు సంతోష్ కారణం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. పైగా..కవిత అరెస్టు సమయంలో , బెయిల్ పై విడుదలైన సమయంలో మినహాయించి సంతోష్ ప్రత్యేకంగా కవితను పరామర్శించేందుకు జైలుకు వెళ్ళింది లేదు.
పైగా.. బీఆర్ఎస్ నేతలు బీజేపీని , కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కోవాలని దూకుడు పెంచుతుంటే అసోం, ఒడిషాలో మొక్కలు నాటే కార్యక్రమంపై సంతోష్ కుమార్ ఫోకస్ పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణను వదిలేసి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంతోష్ రావుకు ఏం పని అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. బీఆర్ఎస్ లో ఆదరణ లేకపోతే బీజేపీ వైపు వెళ్తానని చెప్పేందుకు ఆయన ఈ రకమైన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది.