దక్షిణాది సినిమాలు హిందీ ప్రజల మనసుల్ని గెల్చుకుంటున్నాయి. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ దగ్గర్నుంచి అందరూ రియలైజ్ అవుతున్నారు.అయితే కొంత మందికి మాత్రం ఇంకా హెడ్ వెయిట్ తగ్గడం లేదు. బాలీవుడ్లో కండలు చూపించి.. రొమాంటిక్ సినిమాలు చేసి కాస్త ఫేమ్ తెచ్చుకునితర్వాత ఫైటింగ్ సినిమాలుచేస్తున్న జాన్ అబ్రహం.. తనను తాను పెద్ద బాలీవుడ్ హీరో అనుకుంటున్నారు. తాను బాలీవుడ్ హీరోనని రీజనల్ సినిమాల్లో నటించేదే లేదని తేల్చి చెప్పారు జాన్ అబ్రహం.
ఆయన హీరోగా తెరకెక్కిన ‘ఎటాక్’ అనే సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంటర్యూల్లో ‘సలార్’ సినిమాలో ఆయన నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్లపై స్పందించారు. తను ఎలాంటి తెలుగు సినిమాలో నటించడం లేదని.. ఎప్పటికీ ప్రాంతీయ సినిమాల్లో నటించనని చెప్పారు. తనొక బాలీవుడ్ హీరోనని.. ఎప్పటికీ ఇతర భాషల్లో సెకండ్ హీరోగా, సహనటుడు పాత్రలు చేయనని స్పష్టం చేశారు.
తాను చేయనంటే తన స్టైల్ అనుకోవచ్చు.. కానీ ఇతర నటుల మాదిరి డబ్బు కోసం నటిస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే డబ్బు కాక ఏం ఇస్తారో జాన్ అబ్రహామే చెప్పాలి. షారుఖ్ ఖాన్ నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాలో జాన్ అబ్రహం నటిస్తున్నారు. అందులో హీరో కాదు.