తెలుగుదేశం పార్టీలోని జనవరిలో రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున చేరికల వెల్లువ ఉండే అవకాశం ఉంది ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ హైకమాండ్ తో టచ్లోకి వచ్చారని చెబుున్నారు. వారంతా మొదటి నుంచి వైసీపీ అెధినేత జగన్ కోసం గత పదిహేనేళ్లుగా పని చేస్తున్న వారే . జగన్ కోసం ఎంతగా పని చేసిన తన స్వార్థం కోసం తమను బలి చేయబోతున్నారని అనేక మందికి అర్థం అయింది. అందుకే టీడీపీ అధినేతతో టచ్ లోకి వచ్చారని చెబుతన్నారు.
అదే సమయంలో ప్రభుత్వం మారడం ఖాయమన్న అభిప్రాయం ఉండటంతో తర్వాత వచ్చే ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడితే రాజకీయంగా, ఆర్థికంగా కుంగిపోతామని భయపడుతున్నారు ప్రభుత్వ ప్రభుత్వం టీడీపీ నేతలపై ప్రయోగించిన ఘోరమైన వేధింపులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని.. దానికి బలయ్యేది తామేనన్న భయం రాయలసీమ నేతల్లో వ్యక్తమవుతోంది. ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇదే అంశంపై కంగారు పడుున్నారు. ఇప్పటికీ వైసీపీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పైగా టీడీపీకి టార్గెట్ అవుతామని ద్వితీయ శ్రేణి నేతలు కూడా భావిస్తున్నారు.
అందుకే పెద్దఎత్తున నేతల చేరికలు ప్రారంభమయ్యాయి. కేవలం టిక్కెట్లు ఆశించే వారు కాకుండా… వైసీపీలో ఉండటం దండగ అనుకున్నవారు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. రాయలసీమ నుంచి చేరేవారిలో ఎక్కువ మంది టిక్కెట్లు ఆశించే వారు కాదని.. పొటెన్షియల్ లీడర్లకు మాత్రం టిక్కెట్ ఇస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.