టీవీ ఛానళ్ల డిబేటులో వర్మ – జొన్న విత్తుల ఎపిసోడ్ ఓ రేంజులో నడిచింది. ఇద్దరూ సై అంటే సై అంటూ వాదించుకున్నారు. ఆ వాదనలో కొన్నిసార్లు వర్మది పై చేయి అయితే, ఇంకొన్నిసార్లు జొన్నవిత్తులది పై చేయిగా మారింది. ఆనాడే `నీపై సినిమా తీసి.. నువ్వేంటే ఏమిటో జనాలకు చూపిస్తా` అంటూ శపథం చేశారు జొన్నవిత్తుల. అనుకున్నట్టే `ఆర్జీవి` (రోజూ గిల్లే వాడు) అనే పేరుతో ఓ సినిమా మొదలెట్టారు. ఇప్పటికి రెండు పాటల్ని విడుదల చేశారు. `ఓడ్కా మీద ఒట్టు.. నేబడ్కవ్ నా కొడుకుని` అంటూ.. తొలి పాట విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు రెండో పాట వదిలారు.
`దయ్యంతోనే అన్నీ చేయాలనుకుంటాడే వీడు
కల్లోకొచ్చిన కాష్మోరాతో కక్కుర్తి పడతాడు` అంటూ వర్మ దెయ్యాల్నీ వదలడు అనే రేంజులో పాట రాశారు. తొలి పాటలో వర్మ నైజాన్ని బయటపెడితే, రెండో పాటలో.. వర్మలోని దాదాపు అన్ని `యాంగిల్స్`నీ బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ రెండు పాటల్నీ రాసింది జొన్న విత్తులే.
సృష్టిలో వీడంత శృంగార ద్రోహి ఎవడూ లేడు
ఎగ్సార్సిస్టుకి రిబ్బన్ కట్టి ఎక్స్పోజ్ చేస్తాడు
కసిలో ఖరుడు
మసలి జడుడు
సెక్సోన్మాదుడు
దుష్బ్రస్టుడు… అంటూ… ఏ రేంజులో ఆడుకున్నాడు. ఇలాంటి పాటలు ఇంకో రెండున్నాయట ఈ సినిమాలో. మొత్తానికి జొన్న విత్తుల వర్మపై రివైంజ్ తీర్చుకోవడానికి బాగానే ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.