మీడియాలో ఉంటే ఏమైనా చేయొచ్చు. ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేయొచ్చన్న అపోహ కొందరిలో ఉంది. ఆ బ్లాక్మెయిల్ జర్నలిజంతోనే… జర్నలిజంపై గౌరవం పోగొడుతున్నారు. అసలు ఇండ్రస్ట్రీ పడుతూ లేస్తూ ఉంది. నిర్మాతలు పూర్తిగా మునిగిపోతున్నారు. దానికి తోడు.. ఈ బ్లాక్ మెయిలింగులు ఒకటి. ఆయన ఓ పేరున్న టీవీ ఛానల్ లో పని చేస్తున్న జర్నలిస్టు. ఈ ఛానల్ అంటే.. ఏపీలోని ప్రభుత్వానికి అస్సలు పడదు. ఈ ఛానల్ ని ఓ పార్టీ బాగా సపోర్ట్ చేస్తుందన్నది బహిరంగ రహస్యం. నిజానికి ఈ ఛానల్ లో ముందు నుంచీ బ్లాక్ మెయిలింగ్ న్యూసులకే ప్రాధాన్యం. నాలుగ్గోడల మధ్య జరిగే తంతుని కూడా నిస్సిగ్గుగా ప్రసారం చేసి, టీఆర్పీలు పెంచుకుంటుంది.
ఈ ఛానల్ లో ఓ సీనియర్ సీనీ జర్నలిస్టు ఇటీవల చేరాడు. చేరిన దగ్గర్నుంచి.. నిర్మాతల్ని బెదిరించి డబ్బులు దండుకోవడం పనిగా పెట్టుకున్నాడు. ప్రతీ సినిమాకీ ప్యాకేజీ ఇవ్వాలని, లేదంటే.. ఆ సినిమా గురించి నెగిటీవ్ న్యూసులు రాస్తానని నిర్మాతల్ని బెదిరిస్తున్నాడట. ఆ టీవీ ఛానల్ కి యూ ట్యూబ్ ఛానల్ తో పాటు, ఓ వెబ్ సైట్ కూడా ఉంది. ఆ రెండింటిలోనూ.. సినిమాకి బ్యాడ్ ప్రోపకాండ చేస్తానని, నెగిటీవ్ రివ్యూలు ఇస్తానని నేరుగానే బెదిరింపులకు దిగుతున్నాడట. చిన్న నిర్మాతలనైతే మరీ సతాయిస్తున్నాడని, తన ఆగడాలు మరీ ఎక్కువైపోతున్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఛానల్ హెడ్ వరకూ తీసుకెళ్లాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నార్ట. అయితే ఆ ఛానల్ లో.. సదరు నిర్మాతల గోడు వినేవాళ్లు ఎవరూ లేరు. కనీసం ఛానల్ హెడ్ అయినా, ఈ విషయంపై ఆరా తీసి, తగిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. మరి ఆ బ్లాక్ మెయిలింగ్ జర్నలిస్టు చీడ ఎప్పుడు విరగడ అవుతుందో?