జర్నలిస్టు సాయి తాను పొరపాటున తప్పుడు సమాచారం ఇచ్చానని వీడియో రిలీజు్ చేశారు. అదేమిటంటే.. దావోస్‌లో ఏపీ బ్రాండ్ ను ప్రచారం చేయడానికి ఓ బిజినెస్ చానల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దానికి రూ. 70లక్షలు మంజూరు చేసింది.దీనికి మన జర్నలిస్టు సాయి రూ. 70 కోట్లు ఇచ్చేసిందని రెచ్చిపోయారు. తనకు మాత్రమే సాధ్యమైన మేనరిజంతో వీడియో వదిలారు. ఆయన వీడియోను చూసి చాలా మంది నవ్వకున్నారు కానీ ప్రభుత్వ వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఓ కుట్ర పూరితంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అనుమానించారు. ఆ వీడియోను తర్వాత కూడా తప్పుడు ప్రచారం చేయడానికి ఉపయోగించే లక్ష్యంతో రిలీజ్ చేశారని అర్థం కావడంతో ఫ్యాక్ట్ చెక్ వాస్తవాలను బయట పెట్టింది.
దీంతో జర్నలిస్టు సాయిపై కేసులు పెట్టాలన్న డిమాండ్ లు వినిపిస్తున్నాయి . కేసులు పెడితే పరువుపోతుందని అనుకున్నారేమో కానీ అర్జంట్ గా క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. జీవోను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇది మొదటిసారి కాదు. రోజూ ఆయన ఎనాలసిన్ చేసే వార్తల్లో కనీసం సగం ఫేక్ గా ప్రజెంట్ చేస్తూంటారు. ఓ సారి కియా కార్ బుకింగ్స్ క్యాన్సిలేషన్స్ లేవు అనే వార్త వస్తే మొత్తం కాన్సిల్ అయిపోయాయి…కియా దివాలా తీస్తోందని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ జర్నలిస్టు సాయి నిజంగా కావాలనే అలా చెబుతారా ఆయన అవగాహన అంతేనా అన్న డౌట్ ఎవరికైనా వస్తుంది.
పదేళ్ల కాలంలో వైసీపీకి మద్దతుగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీపై ఎన్ని ఫేక్ న్యూస్ ప్రచారం చేశారో లెక్కలేదు. ఓ సారి చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు సింగపూర్ అర్జంట్ గా వెళ్లి చంద్రబాబు థంబ్ వేయకపోతే వేల కోట్లు ఇరుక్కుపోతాయని వెబ్ స్టోరీ అల్లేశాడు. ఈయన సజ్జల భార్గవరెడ్డి పేరోల్ లో ఉండేవాడని అంటారు. అది ప్రైవేటుగా కావడంతో బయటకు రాలేదు. ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేసి.. లక్షను కోట్లు చేసి చెప్పి.. వైసీపీకి కావాల్సిన విధంగా తప్పుడు ప్రచారం చేసే అవకాశం కల్పిస్తూ.. తన మీదకు వచ్చేస్తే.. క్షమాపణలు చెబుతున్నాడన్న అనుమానాలు ఉన్నాయి.
ఇప్పటికే శృతిమించిపోయిన ఫేక్ న్యూస్ సృష్టికర్త కాబట్టి క్షమాపణలతో సరిపెట్టకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.