ఐదేళ్లు జర్నలిస్టుల గురించి పట్టించుకోండా ఎన్నికలకు మూడు నెలల ముందు ఇదిగో స్థలాలు అంటూ ప్రక్రియ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. తాము జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశామని.. స్థలాలు ఇచ్చేస్తున్నారని ఆశపడిన వారంతా.. దరఖాస్తులు చేసుకున్నారు. వేల మంది అప్లయ్ చేసుకున్నారు. ప్రక్రియపై ప్రతీ వారం ఓ అప్ డేట్ ప్రకటన రూపంలో వచ్చేది. తీరా ఎన్నికల కోడ్ వచ్చే సరికి… జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్స్ చెత్తబుట్టలోకి చేరిపోయాయి.
మాజీ సమాచార, ప్రసార మంత్రి పేర్ని నాని నియోజకవర్గం మచిలీపట్నంలో ఉన్న కలెక్టరేట్ లో ఉండాల్సిన ఫైల్ చెత్తకుప్పలో బయటపడింది. ఈ విషయాన్ని జర్నలిస్టులు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కలెక్టరేట్ లో సమాచార శాఖ డీడీని కలిసి ఆయన వివరణ కోరారు. అయితే ఆ ఫైల్ పోయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు ధికారి. బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని డీడీని హెచ్చరించారు. విచారణ చేయిస్తామని కలెక్టర్ చెప్పారు.
కానీ ఏ జిల్లాలోనూ స్థలాలు ఇచ్చే ప్రక్రియను కనీసం చివరి దశకు కూడా తీసుకు రాలేదు. అస్మదీయ జర్నలిస్టులకు అయినా కేటాయిస్తారని అనుకున్నారు. నిజానికి ఇలా ఆశపడి దరఖాస్తు చేసుకున్న వారిలో బాకా ఊదే మీడియా సంస్థలు.. ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేరుతో చెలామణి అయ్యే వారే ఎక్కువ. ప్రభుత్వ స్థలమే కదా జగన్ రాసిచ్చేస్తారని అనుకున్నారు. చివరికి కోడ్ రాగానే చెత్తబుట్టలో పడేశారు. స్థలాల పేరుతో జగన్ చూపించిన సినిమాకు వారికి మైండ్ బ్లాంక్ అయిపోయినట్లయింది.