జీవీఎల్ నరసింహారావు విశాఖలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న తర్వాతి రోజే విజయవాడ ఎందుకు వచ్చారు..? వైసీపీకి మద్దతుగా ఎందుకు వ్యాఖ్యలు చేశారు..? విశాఖలో చంద్రబాబుదే తప్పన్నట్లుగా ఎందుకు మాట్లాడారు..?. .. అదే రోజున… నేరుగా నేరుగా.. ఒంటరిగా గవర్నర్‌ను కలిసి ఏం చెప్పారు..? ఇవన్నీ.. కొద్ది రోజులుగా.. ఏపీ బీజేపీ నేతల మదిలో ఉన్న ప్రశ్నలు. వీటిని ప్రశ్నలుగానే ఉంచుకోకుండా ఫిర్యాదుల రూపంలో నేరుగా… పార్టీ అధ్యక్షుడకే పంపారు. జీవీఎల్ ఆ రోజున.. ఏపీకి వచ్చిన విషయం పార్టీ నేతలకు తెలియదు. రాష్ట్ర అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలంటే.. రాష్ట్ర పార్టీ నేతల్ని తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లాలి.. కానీ ఆయన ఒక్కరే వెళ్లారు. ఆయన తీరు చాలా అనుమానాస్పదంగా ఉండటం… రాష్ట్ర బీజేపీ విధానాలకు భిన్నంగా ఉండటంతో…పార్టీ నేతలంతా జీవీఎల్ వ్యవహారాల్ని .. అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు.
జేపీ నడ్డా.. జరిగింది మొత్తం ఆరా తీసి.. జీవీఎల్‌పై కస్సుమన్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా కాకుండా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించినట్లు బీజేపీ వర్గాలు మీడియాకు లీక్ ఇచ్చాయి. జీవీఎల్‌ను నడ్డా ప్రత్యేకంగా పిలిచి క్లాస్ పీకారని.. గవర్నర్‌ను ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఏపీ విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి బాధ్యతలు ఇప్పుడు అప్ప చెప్పకపోయనప్పటికీ.. పదే పదే ఎందుకు ఏపీ గురించి మాట్లాడుతున్నారని నడ్డా.. గట్టిగానే అడిగినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జీవీఎల్ ఏపీకి వస్తే.. వైసీపీ నేతలా మాట్లాడుతూ.. ఏపీ బీజేపీ నేతల్ని ఇరకాటంలో పెడుతున్నారు.
ప్రభుత్వంపై పోరాడుతూ.. ప్రజల్లో ఆదరణ పెంచుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తూంటే.. ఆయన మాత్రం.. వైసీపీకి మద్దతు పలుకుతూ.. బీజేపీ-వైసీపీ ఒకటే అన్న భావన కల్పిస్తూ.. తమ ప్రత్నాలను విఫలం చేస్తున్నారన్న అసంతృప్తి రాష్ట్ర నేతల్లో ఉంది. నడ్డా వార్నింగ్‌తో జీవీఎల్ ఇక వైసీపీకి మద్దతుగా మాట్లాడకపోవచ్చని.. బీజేపీ నేతలంటున్నారు.