జూ. ఎన్టీఆర్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం యు.కె.లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెలాఖరున హైదరాబాద్ లో జరుగబోయే ఒక షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన తరువాత మళ్ళీ యూరప్ లో వివిధ ప్రాంతాలలో సినిమాలో మిగిలిన రెండు పాటల షూటింగ్ జరుగుతుంది. నవంబర్ చివరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి పండుగ ముందు ఈ సినిమాను విడుదల చేయాలనుకొంటున్నట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు. ఈసినిమాని బి.వి.యస్.యన్.ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.