`బి ది రియల్ మేన్` పేరుతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. రాజమౌళికి ఓ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయాలన్నదే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. ఈ సవాలు స్వీకరించిన రాజమౌళి – ఇంటి పనులు చేసి, మరో ముగ్గురికి సవాల్ విసిరాడు. అందులో ఎన్టీఆర్ ఒకడు. ఎన్టీఆర్ కూడా ఆ ఛాలెంజ్ స్వీకరించి, ఓ వీడియో పోస్ట్ చేశాడు. చేస్తూ చేస్తూ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో పాటు బాలకృష్ణకూ ఈ సవాల్ విసిరి.. రిసీస్ని కంటిన్యూ చేశాడు.
చిరంజీవి, నాగ్, వెంకీల మాట పక్కన పెడితే – బాలకృష్ణ ఈ సవాల్ ని స్వీకరిస్తాడా, లేదా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలయ్యతో ఎన్టీఆర్‌కి సత్సంబంధాలేం లేవు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న విషయాన్ని నందమూరి అభిమానులు సైతం ఒప్పుకుంటారు. ఈ విషయం చాలాసార్లు రుజువైంది కూడా. అయితే ఈ ఛాలెంజ్ లో ఎన్టీఆర్… బాలయ్యని ఎంచుకోవడమే పెద్ద ట్విస్టు. అంటే.. తనవైపు నుంచి బాలయ్యతో ఎలాంటి సమస్యలూ లేవన్న సంకేతాలు పంపడానికి ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఛాలెంజ్‌ని బాలయ్య స్వీకరిస్తే.. ఈ కోల్డ్ వార్కి ముగింపు పలికినట్టే అనుకోవాలి. కానీ.. బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందన్నది పెద్ద ప్రశ్న. ఇటీవల చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు జరుపుకున్నారు. సెలబ్రెటీలంతా సోషల్ మీడియా వేదిక చేసుకుని చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా స్పందించారంతా. అయితే.. ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి ట్వీటూ రాలేదు. ఈ విషయంలో నందమూరి అభిమానులు ఎన్టీఆర్‌పై గుర్రుగాఉన్నారని టాక్. ఇలాంటి సందర్భంలో బాలయ్య… ఎన్టీఆర్ ఛాలెంజ్ స్వీకరించే అవకాశమే లేదని కొంతమంది నందమూరి ఫ్యాన్స్నమ్ముతున్నారు. మరి బాలయ్య ఏం చేస్తాడో?