ఓ దర్శకుడు హిట్ కొట్టాడంటే అతనితో ఖచ్చితంగా సినిమా చేస్తాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. లాస్ట్ ఇయర్ టెంపర్ తో అభిమానులను అలరించిన ఈ హీరో ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్లో నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడా అనే కన్ఫ్యూజన్ ఉండేది. తెలుస్తున్న కథనాల ప్రకారం ఎన్టీఆర్ కొరటాల సినిమాను ఓకే చేశాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాను అక్టోబర్ 22న దసరా పండుగనాడు ముహూర్తం పెట్టానున్నారని ఎక్స్ క్లూజివ్ టాక్.
శ్రీమంతుడుతో సూపర్ హిట్ కొట్టి మంచి జోష్ మీదున కొరటాల తన నెక్స్ట్ సినిమా రవితేతో చేస్తున్నాడనే వార్తలు వినిపించినా ఫైనల్ గా ఎన్టీఆర్ సినిమానే చేస్తుండటం విశేషం. బృందావనం లాంటి సినిమాలకు ఎన్టీఆర్ కు కథ అందించిన కొరటాల శివ మొదటిసారి యంగ్ టైగర్ ను డైరెక్ట్ చేయడం ఫ్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది కాస్ట్ అండ్ క్రూ ఏంటనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.