`ఆచార్య` ఫలితం నుంచి బయటపడి.. ఎన్టీఆర్ సినిమా పనుల్లో మునిగిపోయారు కొరటాల. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా.. ఎన్టీఆర్ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో.. కొరటాలకు ఎన్టీఆర్ కో సలహా ఇచ్చాడన్నది టాలీవుడ్ టాక్. `గత సినిమాల ఫలితాల గురించి ఆలోచించకు… మన కథమీదే ఫోకస్ పెట్టు.. కావాలంటే.. ఇంకొంచెం టైమ్ తీసుకో..` అని చెప్పాడట.
అంతే కాదు.. కొరటాల ట్విట్టర్ లో యాక్టీవ్ గా లేరు. ఆయనకు ట్విట్టర్ ఎకౌంట్ ఉన్నా, `ఆచార్య` సమయంలో అందులోంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు కొరటాలను మళ్లీ ట్విట్టర్లోకి రమ్మని ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట. తమ కాంబోలో సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వడానికీ, ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడానికీ, సినిమాలపై వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికీ ట్విట్టర్ వేదికగా ఉపయోపగడుతుందని, ఫ్యాన్స్‌కి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇవ్వకపోతే.. వాళ్లు అసంతృప్తికి లోనవుతారని, అందుకే ట్విట్టర్లో మళ్లీ యాక్టీవ్ కావాలని ఎన్టీఆర్ కోరాడట. సో.. కొరటాల మళ్లీ ట్విట్టర్లోకి రావడం దాదాపుగా ఖాయమన్నమాట.