తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా.. కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి మద్దతుగా కుటుంబం అంతా తరలి వస్తోంది. సుహాసినిని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి .. మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కుటుంబం మద్దతు లేదని.. బ్రదర్స్ మనస్ఫూర్తిగా అంగీకరించలేదని… వారు ప్రచారం చేయడం కష్టమేనని చెప్పుకొచ్చారు. కానీ.. కుటుంబం మద్దతు ఉందని… అందరూ వరుసగా కూకట్పల్లి బరిలోకి దిగుతూండటంతో క్లారిటీ వస్తోంది. తారకరత్న సహా.. ఇప్పటికే.. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పలువురు కూకట్పల్లిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఏకంగా మూడు రోజుల పాటు.. ప్రచారం చేయలాని నిర్ణయించుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్లో ఉన్నారు. రాజమౌళి సినిమా షూటింగ్ అంటే.. ఇంటికి వెళ్లడం కూడా ఉండదు. సెట్లో ఫిక్సయిపోయినట్లే. పైగా.. కొత్త సినిమా కోసం.. ఆయన యూనిట్ మొత్తానికి ఓ ఇంటిని కూడా కట్టించారు. అందరూ అక్కడే ఉంటూ.. షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో… జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఎన్టీఆర్ ప్రచారం చే్యకపోతే.. కుటుంబంలో విబేధాలున్నాయని ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో.. అలాంటి అవకాశమే ఇవ్వకూడదని… ప్రచారానికి మూడు రోజులు కాల్షిట్లు కేటాయించినట్లు సమాచారం.
సుహాసిని ప్రచారం విషయంలో కోసం.. నందమూరి బాలకృష్ణ.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు… కొంత మంది ఇన్చార్జులను నియమించారు. రాహుల్ గాంధీతో కలిసి.. రోడ్ షో కూడా కూకట్పల్లిలో నిర్వహించే అవకాశం ఉంది. అలాగే.. బాలకృష్ణ కూడా విడిగా రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రచారం ముగింపు రోజు భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు.