`ఆర్.ఆర్.ఆర్` కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడు. బాడీ పెంచాడు. కొన్ని సీన్లలో కావాలనే బొద్దుగా కనిపించాడు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు తారక్. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలీష్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే శరీరాకృతి కూడా మార్చాలనుకుంటున్నాడు. అందుకోసమే బరువు తగ్గాలని తారక్ నిర్ణయించుకొన్నాడట. కనీసం ఆరు నుంచి ఎనిమిది కిలోల వరకూ బరువు తగ్గాలని టార్గెట్ గా పెట్టుకొన్నాడట. అందుకోసం స్పెషల్ ట్రైనర్‌ని నియమించుకొన్నాడు ఎన్టీఆర్. కొరటాల సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ఇంకో మూడు నెలల సమయం ఉంది కాబట్టి… ఈలోగా ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సంతరించుకోవడం ఖాయం. ఆర్.ఆర్.ఆర్ తరవాత.. కొన్ని రోజులు విరామం తీసుకోవాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. త్వరలోనే ఓ ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడట. తిరిగొచ్చాక… కసరత్తులు మొదలెట్టేస్తాడు. కొరటాలతో పాటుగా ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు కూడా ఓ కథ రెడీ చేసుకున్న సంగతి తెలిసిందే. అది స్పోర్ట్స్ డ్రామా. కాబట్టి.. దాని కోసం మరోసారి.. సిక్స్ప్యాకులూ గట్రా తెచ్చుకోవాలి. అనిల్ రావిపూడి కూడా ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడన్నది టాలీవుడ్ టాక్.