హమ్మయ్య… ఎట్టకేలకు ఓ కన్ఫ్యూజన్కు తెరపడింది. ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎప్పుడు, ఎవరితో అనే విషయాల్లో క్లారిటీ వచ్చింది. దాదాపు పదిమంది దర్శకులు చెప్పిన కథలు వినీ.. వినీ.. చివరికి బాబి చెప్పిన కథకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. సర్దార్ – గబ్బర్‌సింగ్‌తో ఫ్లాప్ ఇచ్చినా.. బాబి కథ బాగా నచ్చడంతే, ఇంకేం ఆలోచించకుండా బాబీకి పచ్చజెండా ఊపేశాడు. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మిస్తారని ప్రచారం జరిగినా… చివరికి ఎన్టీఆర్ తన సోదరుడి సంస్థలోనే సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 2017 జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్‌రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దర్శకుడు ఫిక్స్ అయ్యాడు కాబట్టి.. ఇప్పుడు కథానాయిక కోసం అన్వేషణ ప్రారంభించేశారు. మరో వారం పది రోజుల్లో హీరోయిన్ని ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. రవితేజ కోసం రాసుకొన్న కథని కూడా బాబి ఎన్టీఆర్ కి వినిపించాడు. అయితే ఆ కథ ఎన్టీఆర్‌కి అంతగా నచ్చలేదని, కొద్దిరోజుల వ్యవధిలోనే మరో కొత్త కథతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడని.. దీనికి మాత్రం తారక్ ఫిదా అయిపోయాడని తెలుస్తోంది.