ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్ మారిపోయింది. ఆయనకు రిమాండ్ విధించి రెండు వారాలు అవుతోంది. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ కు వారం రోజులు సమయం తీసుకుని .. ఆ వారం రోజుల్లో దేశం మొత్తం ప్రెస్మీట్లు పెట్టిన వారు.. హైకోర్టులో మాత్రం.. చంద్రబాబు ఏ విషయంలో తప్పు చేశారో చెప్పలేదు. కానీ రిమాండ్ రిపోర్టును చదివి మరోసారి వినిపించారు. అరె్ట్ అక్రమం అంటూ.. చంద్రబాబు లాయర్లు గట్టి వాదనలు వినిపించారు.
కానీ తీర్పు మాత్రం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియడం లేదు. మంగళవారం విచారణ పూర్తి చేశారు. రెండు రోజుల్లో తీర్పు వస్తుందనుకున్నారు. గురువారం అందరూ తీర్పు కోసం ఎదురు చూశారు. కానీ ఎలాంటి సూచనలు రాలేదు. ఇరవై ఐదే తేదీకి వాయిదా పడిందని ఎవరో లాయర్ మీడియాకు చెప్పారు. జాతీయ మీడియా న్యూస్ ఎజెన్సీలు అదే ప్రచారం చేశాయి. అది నిజమో కాదో తెలియదు. అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు. మరో వైపు కస్టడీకి కావాలంటే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తి చేసిన ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వడానికా ఆలోచిస్తోంది. సోమవారం వరకే హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. తర్వాత ఇవ్వలేదు.
అందుకే విచారణ పూర్తి చేశారు జడ్జి. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చాకే ఇస్తానని రెండు పూటలు వాయిదా వేసి..మళ్లీ శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. క్వాష్ పిటిషన్ తీర్పు వస్తే సరే లేకపోతే.. ఆ తీర్పు కూడా వస్తుందో రాదో. విశేషం ఏమిటంటే.. అంగళ్లు కేసులో అందరికీ బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చాయి..కానీ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై మాత్రం శుక్రవారం విచారణ జరగనుంది.