అన్‌రాక్, ఏపీఎండీసీ మధ్య బాక్సైట్ సరఫరా వివాదం పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీలో జుల్ఫీ రావ్జీ అనే వ్యక్తికి చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రావ్జీ ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికే ఆయన కేబినెట్ హోదా పదవిలో ఉన్నారు. వైఎస్ హయాంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం రస్ ఆల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి పర్మిషన్లు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వాలు బాక్సైట్ అనుమతుల్ని రద్దు చేశాయి. తమకు నష్టం వచ్చిందని రాకియా అంతర్జాతీయ వివాదాల పరిష్కార వేదికను ఆశ్రయించింది. ఈ వివాదానికి సంబంధించి పరిష్కారం కోసం ఆరుగురు సీనియర్ అధికారులతో కమిటీని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడీ కమిటీలో జుల్ఫీ రావ్జీని చేర్చారు.
ప్రస్తుతం జుల్ఫీ రావ్జీ … గల్ఫ్ దేశాలన్నీ… కవర్ చేసేలా.. మిడిల్ ఈస్ట్‌కు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఈయనకు కేబినెట్ హోదా ఉంది. ఆయనెవరో సామాన్యులెవరికీ తెలియదు. సామాన్యులకే కాదు.. ఏపీ ఉన్నతాధికారులకు కూడా తెలియదు. 2019 జూలై చివరిలో… సెర్బియాలో.. నిమ్మగడ్డను అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయడానికి కారణం గల్ఫ్ దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాను మోసం చేయడం. రస్ అల్ ఖైమా విజ్ఞప్తి మేరకే నిమ్మగడ్డను అరెస్ట్ చేశారు. చాలా కాలం పాటు నిమ్మగడ్డ అక్కడి జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ పొంది ఇండియాకు వచ్చారు. నిమ్మగడ్డ అక్కడి జైల్లో ఉన్నప్పుడే… జుల్ఫీ నియామకం జరిగింది. అప్పట్లోనే ఈ నిమ్మగడ్డ కేసుకు… ఈ నియామకానికి సంబంధం ఉందన్న ప్రచారం జరిగింది.
నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన సంస్థలు రస్ అల్ ఖైమా నుంచి పెట్టుబడులు తీసుకున్నాయి. వాటిలో కొన్ని జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లించారు. ఇవన్నీ క్విడ్ ప్రో కో అని సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ కారణాలతోనే ఈ అంశంపై ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది. కొద్ది రోజుల కిందట… జుల్ఫీ కి సహాయకారిగా ఉండేలా… ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు. బాక్సైట్, వాన్ పిక్ సహా అనేక అంశాల్లో రస్ అల్ ఖైమాతో వివాదాలు సెటిల్ చేసుకోవడం … ముఖ్యమంత్రికి అత్యవసరం కాబట్టి… ఈ విషయంలో జుల్ఫీ అనే వ్యక్తిపై ఎక్కువ ఆధారపడుతున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ అధికారుల కమిటీలోకి ఆయనను తీసుకు వచ్చారని అంటున్నారు.