ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శరవేగంగా జంగిల్ క్లియరెన్స్ జరుగుతోంది. ఇరవై ఆరు వేల ఎకరాల్లో ఐదేళ్ల పాటు పెరిగిపోయిన పిచ్చి మొక్కల్ని.. చిల్ల చెట్లను తొలగించడానికి వందల కొద్ది యంత్రాలతో రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నారు. నెల రోజుల్లో పని పూర్తి చేస్తామని కాంట్రాక్ట్ సంస్థ హామీ ఇచ్చింది. జంగిల్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత అమరావతికి ఓ లుక్ వస్తుంది.
జంగిల్ క్లియరెన్స్ కోసమే ఇన్వెస్టర్లు, రైతులతో పాటు ప్రభుత్వం కూడా చూస్తోంది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి అయిపోతే మంచి రోజు చూసుకుని నిర్మాణాలను పునం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఐదేళ్ల పాటు ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఐఐటీ మద్రాస్ నిపుణులు నిపుణులు పరిశీలించారు. ప్రాథమిక నివేదికను ఎప్పుడైనా సమర్పించే అవకాశం ఉంది. కొన్ని ఇంజినీరింగ్ చర్యలను సిఫారసు చేసి నిర్మాణాలను మళ్లీ ప్రారంభించేందుకు సిఫారసు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్మాణాలు ప్రారంభమైతే ఆటోమేటిక్ గా .. ప్రైవేటు సంస్థల నిర్మాణాలు ప్రారంభభమవుతాయి.
ప్రభుత్వ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆ ప్రాజెక్టు కొనుగోలుదారులు తమ ప్లాటను రద్దు చేసకోలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించనున్నారు. జంగిల్ క్లియరెన్స్ అయ్యాక.. వారందరికీ పొజిషన్లు చూపించి.. నిర్మాణాలు ప్రారంభించేలా చూడనున్నారు. మొత్తంగా జంగిల్ క్లియరెన్స్ పూర్తయ్యాక.. రెండు నెలల్లో విస్తృతంగా అమరావతిలో నిర్మాణ కార్యకలాపాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు అర్థిక కార్యక్రమాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.