మామయ్య చంద్రబాబు, లోకేష్ కరోనా నుంచి త్వరలో కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్ పుట్టిన రోజలకు కూడా విష్ చేస్తూ ట్వీట్లు పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం కోలుకోవాలని ట్వీట్ పెట్టడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న తర్వాత.. అందరూ స్పందించారు.. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.
అయితే కర్ర విరగకుండా .. పాము చావకుండా స్పందించారని ఇది పద్దతి కాదని టీడీపీ నేతల నుంచి కామెంట్లు వచ్చాయి. అయితే రాజకీయాలకు .. దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ఈ అంశాలపై లైట్ తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆయన పేరును ఇతర పార్టీలు వ్యూహాత్మకంగా వాడుకుంటున్నాయి. కుప్పం లాంటి చోట్ల చంద్రబాబు పర్యటనల్లో ఓ పది మంది గుమికూడి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నినాదాలు చేయడం కామన్ అయిపోయింది.
వైసీపీ నేతలే ఇలాంటి వారిని తయారు చేసి.. నినాదాలు చేసి.. అనుకూలమైన మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని టీడీపీకి స్పష్టమైన సమాచారం ఉండటంతో ఈ విషయం పెద్దగా హైలెట్ కాలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్.. తన సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలతోనూ ఇటీవలి కాలంలో కలిసిన సందర్భాలు లేవు. అయితే వీలైనంత వరకూ వివాదాల్లోకి రాకుండా ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారు.
Wishing you Mavayya @ncbn garu and @naralokesh a speedy recovery. Get well soon! https://t.co/cygw7hmARc
— Jr NTR (@tarak9999) January 18, 2022