వైసీపీ నేతలకు కులాలతో ఎలా ఆటలాడుకోవాలో బాగా స్టడీ చేసి గేమ్ ఆడుతున్నట్లుగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని కులాలను కించపర్చడం .. ఆ తర్వాత అబ్బే అదేమీ లేదనడం పరిపాటిగా మారింది. అమలాపురంలో వైసీపీ నేతలపై దాడులకు.. శెట్టిబలిజలే కారణం అని.. జూపూడీ ప్రభాకర్ ఆరోపించారు. అంతే కాదు. .. వారిపై దారుణమైన ఆరోపణలు చేశారు. వారు స్పహలో ఉండి చేయలేదని గంజాయి మత్తులో ఉండి అలా ప్రవర్తించారని జూపూడి ప్రభాకర్ విమర్శించారు. శెట్టి బలిజలు కోనసీమలో ఎస్సీలతో కలిసి ఉంటారని, ఎన్నికల్లో ఒక్కటవుతారన్నారు.
కోనసీమలోని శెట్టి బలిజల్లో కూడా అంబేడ్కర్ పేరును సహించలేనటువంటి ఒక తరం వచ్చిందని, తనకు సమాచారం అందిందన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీలోని శెట్టి బలిజ నేతలు కూడా మండిపడ్డారు. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో ఆయన సారీ చెప్పాలని హైకమాండ్ ఆదేశించింది. నిజానికి ఓ కులంపై ఇష్టారీతిన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి జూపూడి ప్రభాకర్ సిద్ధం కారు.
ఆయనకు వైసీపీ వ్యూహకర్తలు ఏం మాట్లాడాలో చెప్పిన తర్వాతనే మాట్లాడి ఉంటారు. ఓ రకమైన కుల చిచ్చు పెట్టడానికి వైసీపీ పెద్దలు ఆడుతున్న నాటకంలో జూపూడి ప్రభాకర్ ఓ భాగం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. మొన్న తిట్టి.. ఇవాళ సారీ చెప్పి.. కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యతిరేక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఇలా వ్యూహాలు పాటిస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.