ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటనలో నిందితులకు ఆలస్యం లేకుండా.. శిక్ష వేయాలని.. అదీ కూడా బహిరంగ శిక్ష అమలు చేయాలనే డిమాండ్ పబ్లిక్ నుంచి బలంగా వినిపిస్తోంది. నిందితులు ఉన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు వేల మంది గుమికూడి.. నిందితుల్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి నిందితుల్ని చంపేయాలన్నత కోపం వారిలో కనిపిస్తోంది. నాడు నిర్భయ ఘటన జరిగినప్పుడు.. ప్రపంచం మొత్తం కన్నీరు పెట్టుకుంది. భారతదేశంలో బాలికల పరిస్థితిని చూసి జాలి పడింది. మా బాలికల భవిష్యత్ పట్ల… ప్రపంచం మొత్తానికి దిగులక్కర్లేదని.. మరోసారి అలాంటివి జరగకుండా చూసుకుంటామని… చెప్పుకున్న ప్రభుత్వం… మేథోమథనం చేసి నిర్భయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ.. ఆ చట్టం.. తెచ్చిన మార్పేమీ లేదు.
అమ్మాయిలపై నేరాల్లో .. ఘోరాల్లో తగ్గుదల లేదు. రికార్డులు చూస్తే ఇంకా పెరిగిపోయాయి. ఎందుకిలా జరిగిందటే.. నిర్భయ చట్టం కింద.. శిక్ష పడిన కేసులు.. కొన్నే. అందుకే..నేరస్తులు చెలరేగిపోతున్నారు. దేశంలో ముక్కుపచ్చలారని బాలికలపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలే ఇలాంటి వాటిలో ఉంటున్నారు. ఉత్తరాదిలో ఇలాంటివి బయటపడినప్పుడు… హడావుడికిగా చట్టాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం… మైనర్లపై అత్యాచారాలకు పాల్పడితే.. మరణశిక్ష విధించే చట్టం తెచ్చారు. అది కూడా.. పలుకుబడి ఉన్న వారికి చుట్టంగా మారిపోయింది. అందుకే… ఓ నిర్భయ..మరో ప్రియాంక.. తరహా ఘటనలు జరిగినప్పుడు… సామాన్యుల్లో అసహనం తన్నుకొస్తోంది.
ఇన్స్టంట్ న్యాయం కోసం.. జనం రోడ్డెక్కుతున్నారు. ప్రియాంకకు న్యాయం చేయడం అంటే..కుటుంబంలో ఒకరికి ఉద్యోగం… ఆర్థిక సాయం చేయడం కాదు. ప్రియాంకకు న్యాయం చేయడం అంటే.. భవిష్యత్లో ఇలాంటి నేరాలకు పాల్పడేవారు… భయంతో వణికిపోయేలా.. నిందితులను శిక్షించారలి. అమ్మాయిలు.. ఒంటరిగా.. ఎక్కడ కనిపించినా.. కన్నెత్తి చూడటానికి.. భయపడిపోవాలి. అలాంటి శిక్ష విధించినప్పుడే.. ప్రియాంకకు న్యాయం జరుగుతుంది. అలాంటి శిక్ష విధించే సత్తా ప్రభుత్వాలకు ఉందా..?