నా వల్లే సమస్య అయితే నేను వెళ్లిపోతారా అని.. డైలాగ్ కొట్టి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన వల్ల కెనడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. భారత్ తో సహా ఎన్నో దేశాలతో చిక్కులు తెచ్చి పెట్టుకున్నారు. అంతేనా .. అమెరికాకూడా తమ దేశంలో కలిసిపోవాలని ఒత్తిడి చేసే పరిస్థితి వచ్చింది. ఇక స్వదేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి.. ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు . చివరికి ఆయన ఎవరినైతే బుజ్జగించాలని అనుకున్నారో వారే ఆయనకు మద్దతు ఉపసంహరించడంతో పదవికి రాజీనామా చేయక తప్పలేదు.
జస్టిన్ ట్రూడో పదేళ్ల పాటు కెనడా ప్రధానిగా ఉన్నారు. భారత్ పట్ల ఆయన విధానం పూర్తి గా రాజకీయ కోణంలో ఉండేది. అక్కడి ఖలిస్తానీ వేర్పాటువాదులపై చర్యలు తీసుకోవాలని భారత్ చాలా కాలంగా కోరుతూ వస్తోంది. ట్రూడో ప్రభుత్వం తమ ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఖలిస్తాన్ పట్ల మెతక వైఖరితో ఉండేది. అక్కడి నుంచి భారత్ పై కుట్రలు చేయడానికి ఆయన సహకరించేవారు. చివరికి ఓ ఉగ్రవాదిని ఎవరో చంపేస్తే.. దాన్ని భారత్ పై నెట్టేసి కెనడాలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న సిక్కుల్ని ఆకట్టుకోవాలనుకున్నారు. చివరికి అది దౌత్యవేత్తల్ని బహిష్కరించే వరకూ వెళ్లింది.
కెనడాలో ఈ సంవత్సరం అక్టోబర్ 2025లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకూ ట్రూడో ప్రధానిగా ఉంటే ప్రలు సహించే పరిస్థితి లేకపోవడంతో ఆయన వైదొలిగారు. కెనడాలో కూడా బ్రిటన్, అమెరికా తరహాలో రాజకీయ వ్యవస్థ ఉంది. లిబరల్ పార్టీ పూర్తిస్థాయి ప్రధానమంత్రిని చేయాలనుకుంటే, ఆ పార్టీ నేతల్లో ఒకరిని ఎంపిక చేయడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించి నామినేషన్లు కోరుతారు. కొంత సమయం పడుతుంది… కానీ ఆయనను సొంత పార్టీ త్వరగా వదిలించుకోవాలని అనుకుంటోంది.