ఎమ్మెల్సీ కవిత మరో మూడు వారాల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఎదుట కానీ.. ఈడీ ఎదుట కానీ హాజరయ్యే చాన్స్ లేదు. సమన్లు ఇచ్చ్చినా సరే ఆమె హాజరు కారు. ఎందుకంటే.. ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. తన కాలుకు ఫ్రాక్చర్ అయినందున వైద్యులు మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారని ప్రకటించారు.
ఇటీవల ఆమె లిక్కర్ స్కాంలో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన పది ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. ఈ పది ఫోన్ల విశ్లేషణ తర్వాత ఆమెను మరోసారి ఈడీ అధికారులు విచారణకు పిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమె గాయపడటంతో ఆ విచారణ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ విచారించదల్చుకుంటే ఈడీ అధికారులు ఇంటికే వచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నెలాఖరులో జరగనుంది. సుప్రీంకోర్టులో కవితను ఇంటి దగ్గరే విచారించాలన్నట్లుగా ఆదేశాలు వస్తే ఇక కవితకు టెన్షన్ తప్పినట్లే.
విచిత్రం ఏమిటంటే గతంలో కేటీఆర్ కు కూడా సేమ్ ఇలాగే కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పట్లో కేటీఆర్ మూడు వారాలకుపైగానే బెడ్ రెస్ట్ తీసుకున్నారు. తన కాలుకు వేసిన బ్యాండేజీతో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు కవితకు అలాగే కాలుకు ఫ్రాక్చర్ అయింది.