బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు గత వారం ఓ ఫిర్యాదు వచ్చింది. అదేమిటంటే… రోడ్ నెంబర్ 12లో స్థలాన్ని కొంత మంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. దొంగ డాక్యుమెంట్లు తెచ్చి.. చదును చేసి.. తమది క్లెయిమ్ చేసుకుంటున్నారని… ఆ ఫిర్యాదు సారాంశం. వెంటనే పోలీసులు… ఆ స్థలం దగ్గరకు వెళ్లి… చదును చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని.. వారిని ఎవరు పంపారు..? అసలేం జరిగిందన్నదాన్ని.. ఆరా తీశారు. చివరికి స్కెచ్ అంతా.. టి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నేత.. ప్రస్తుతం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న కే.కేశవరావు కుమారుడు వెంకట్ కుమార్‌దిగా తేలింది. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే … కేకేతో పాటు ఆయన కుమారుడు కూడా.. పోలీసులకు ఫోన్ చేసి… తాము ఆ స్థలానికి సంబంధించిన వాళ్లతో.. రాజీకి వచ్చామని… కేసు నమోదు చేయవద్దని… విషయాన్ని బయటపెట్టవద్దని… బతిమాలుకున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత కావడంతో… పోలీసులు కూడా మిన్నకుండిపోయారు.
కానీ అంతకు ముందు ఫిర్యాదు వచ్చినప్పుడు… పోలీసులు స్థలం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో… సబ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసిన.. కేకే కుమారుడు.. తీవ్ర స్థాయిలో దూషించిటన్లు ప్రచారం జరుగుతోంది. అయినా.. పోలీసులు… ప్రభుత్వ పెద్దలతో… గొడవ ఎందుకని.. సైలెంట్‌గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేకే కుమారుడు కబ్జా చేయబోయిన.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని స్థలం ఉమెన్ కోపరేటిగ్ సొసైటీకి చెందినది. ఈ భూమికి సంబంధించిన వివాదాలు ఇప్పటికే కోర్టుల్లో ఉన్నాయి. రెండేళ్లు కోర్టులో కేసు ఉన్నప్పటికీ.. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి… కబ్జాకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎన్నికల వేడి ఉండటంతో… కేకే కుమార్తె విజయలక్ష్మి ఖైరతాబాద్ టిక్కెట్ కోసం… ప్రయత్నాలు చేస్తున్న కారణంగానే… కబ్జా ప్రయత్నంలో.. కేకే కుమారుడు.. వెనుకడుగు వేసినట్లు భావిస్తున్నారు.
నిజానికి ఈ ఉమెన్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూమిలో చాలా వివాదాలు ఉన్నాయి. గత వారంలోనే .. కేపీ రెడ్డి అనే వ్యక్తి అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లింది కూడా.. ఉమెన్ కోపరేటివ్ సొసైటీ భూమి విషయంలోనే. అయితే ఈ విషయంలో లగడపాటి రాజగోపాల్ జోక్యం చేసుకున్నారు. కేపీ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు. కాస్తంత హంగామా చేశారు. కేపీ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న భూమిని ఐజీ నాగిరెడ్డి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఐజీ నాగిరెడ్డి కూడా స్పందించి ఆ భూమితో లగడపాటి రాజగోపాల్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తతం ఆ భూమి వ్యవహారం కోర్టులో ఉంది. అయితే.. కేకే కుమారుడు కబ్జా చేయబోయిన భూమి.. ఆ భూమేనా..? అందులో… కొంత భాగమా..? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.