కళాతపస్వికి దాదా సాహెబ్ పురస్కారం రావడంతో టాలీవుడ్లో పండగ వాతావరణం నెలకొంది. అందరి కళ్లూ ఆయనమీదే. ఆయన మరో సినిమా చేస్తే బాగుణ్ణు.. అని కోరుకొనేవాళ్లెంతోమంది. శుభప్రదం తరవాత విశ్వనాథ్ నుంచి మరో సినిమా రాలేదు. నటనపై మక్కువ పెంచుకొన్నారో, లేదంటే నిర్మాతలు రావడం లేదో తెలీదుగానీ.. విశ్వనాథ్ దృష్టి పూర్తిగా దర్శకత్వం నుంచి పక్కకు తప్పుకొంది. ”విశ్వనాథ్ గారు మళ్లీ దర్శకత్వం వహించాలి.. ఆయన సినిమా తీస్తానంటే.. నేను నిర్మాతగా మారతా” అని ఓ సందర్భంగా త్రివిక్రమ్ సెలవిచ్చాడు.
టీవీ షోల్లో, మీడియా ముందు ఇలాంటి ముఖస్తుతి మాటలు చాలానే మాట్లాడతారు. ఆ తరవాత.. మర్చిపోతారు. త్రివిక్రమ్ కూడా ఇచ్చిన మాట తప్పినట్టున్నాడు. అందుకే త్రివిక్రమ్ సినిమా ఏమైంది?? అంటూ విశ్వనాథ్ని అడిగితే…. ‘అదేదో ఆయన్నే అడగండి’ అంటూ సున్నితంగా సమాధానం ఇచ్చారు. విశ్వనాథ్ దర్శకత్వంలో త్రివిక్రమ్ నిర్మాతగా ఓ సినిమా అంటే… కచ్చితంగా జనం దృష్టి పడుతుంది. త్రివిక్రమ్ పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీ కూడా ఉంటుంది. అయినా సరే… త్రివిక్రమ్ ఆ సంగతి మర్చిపోయాడు. సినిమావాళ్లంతే.. చెప్పేది చేయరు.. చేసేది చెప్పరు. త్రివిక్రమ్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడా??