ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ పాల్ వర్సెస్ కేఏ పాల్ ప్రచారంలో వెనుకబడ్డారు. ఇప్పుడు కామెడీ తగ్గించి.. సీరియస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నర్సాపురంలో కేఏ పాల్ ఉన్న హోటల్లో … మూడు రోజుల క్రితం.. అర్థరాత్రి పూట కొంత మంది యువకులు చొరబడ్డారు. వారెందుకు వచ్చారో కానీ.. పాల్ తలుపు తట్టి దౌర్జన్యం చేయబోయారు. దాంతో.. వారు పరారయ్యారు. వారంతా వైసీపీ కార్యకర్తలేనని.. మండి పడిన పాల్.. తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. ఆయన జగన్‌కు ఓటు వేయడం బైబిల్‌కు విరుద్ధమంటున్నారు. క్రైస్తవుడిగా ఉంటూ తిరుమలకు వెళ్లే జగన్‌కు ఓటు వేయడం బైబిల్‌కు విరుద్ధమని తేల్చేశారు. రాష్ట్రంపై గౌరవం ఉన్న వారెవ్వరూ జగన్‌కు ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. గతంలో తనను జైలుకు పంపింది కూడా జగనేనని.. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి కుట్ర కూడా ఉందన్నారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణకాష్టమవుతుందని, అలాంటి అవినీతిపరుడు జనంలో ఉండకూడదని, జైలులోనే ఉండాలని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయన్నారు.
జగన్‌తో పాటు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై కూడా… కేఏ పాల్ విమర్శలు చేస్తున్నారు. కానీ జగన్ పై ఆయన చేస్తున్నవే హైలెట్ అవుతున్నాయి. క్రైస్తవాన్ని ఆచరించే జగన్‌కు..ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయన్న ప్రచారం ఉంది. ఇందు కోసం.. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కొంత కాలంగా పాస్టర్లతో అంతర్గత సమావేశాలు నిర్వహించి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో క్రైస్తవ మత ప్రబోధకుడికి..ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కేఏ పాల్.. ఈ విధంగా పిలుపునివ్వడం.. ఆ వర్గం ఓట్లపై కాస్తంతయినా ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది.
కేఏ పాల్ ను.. మొదటగా.. వైసీపీ కామెడీగా తీసుకుంది. కానీ ఆయన రాను రాను.. పూర్తిగా వైసీపీని టార్గెట్ చేస్తూ..వ్యవహారాలు నడుపుతూండటంతో.. అప్రమత్తమయింది. వైసీపీ జెండాను పోలినట్లుగానే కేఏ పాల్ కండువా రంగులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. తనే ముందుగా పార్టీ ఏర్పాటు చేసుకున్నానని.. తన జెండానే.. జగన్ కాపీ కొట్టారని కేఏ పాల్ వాదించారు. అదే.. విషయాన్ని ఈసీకి కూడా చెప్పారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ గుర్తు విషయంలోనూ అదే గందరగోళనం నడిచింది. ఫ్యాన్ తో పోలికలున్నాయన్నారు. తర్వాత వైసీపీ అభ్యర్థుల పేర్లతోనే.. బీఫామ్స్ జారీ చేశారు. ఈ వివాదాలన్నీ ఉండగా.. తాజాగా క్రైస్తవులకు ..జగన్ కు ఓటు వేయవద్దని.. ఓ పిలుపులాంటి సందేశం ఇచ్చారు.