కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ .. మాట్లాడితే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి.. ఉగాండా ప్రెసిడెంట్ వరకూ.. అందరూ.. తన స్నేహితులని చెబుతూ ఉంటారు. అవి వినడానికి చాలా కామెడీగా ఉంటాయి. అందుకే అందరూ ఆయనను కామెడీగా తీసుకంటారు. కానీ… ఆయన చెప్పినట్లుగా… ట్రంప్ సహా…అనేక మంది ప్రపంచదేశాల అధినేతలతో ఆయన మరీ చొరవగా మాట్లాడుతున్న ఫోటోలు.. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అవన్నీ మార్ఫింగ్ కాదు. నిజంగానే కేఏ పాల్‌కు ఆ రేంజ్ ఉంది. ఒకప్పుడు ఆయన… అంతర్యుద్ధంతో ఉన్న అనేక దేశాల అధినేతలతో శాంతి కోసం .. దూతగా చర్చలు జరిపారు.
అయితే… ప్రపంచంలో ఏదైనా దేశంలో సంక్షోభం వచ్చినప్పుడే… పాల్ రేంజ్ బయటకు వస్తుంది. దాన్ని ఆయన చూపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు.. పాల్… శ్రీలంకలో ఉన్నారు. అక్కడ.. కొద్ది రోజుల క్రితం జరిగిన… ఉగ్రవాదుల దాడుల నేపధ్యంలో… అక్కడ శాంతి నెలకొనేందుకు తన వంతు ప్రయత్నం చేయడానికి కేఏ పాల్ శ్రీలంక వెళ్లారు. అక్కడ… శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సేతో కలిసి… టీ తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. మహిందా రాజపక్సేకు.. కేఏ పాల్ స్నేహితుడు. గతంలో.. సునామీ వచ్చినప్పుడు… శ్రీలంకకు… తన అంతర్జాతీయ చారిటీ సంస్థ ద్వారా.. భారీగా సాయాన్ని అందించారు… కేఏ పాల్. చేసిన సాయాన్ని రాజపక్సే గుర్తుంచుకున్నారు.
అందుకే.. ఇప్పుడు కూడా.. పాల్‌ను సాదరంగా ఆహ్వానించి… అతిథి మర్యాదలు చేశారు. అయితే… పాల్.. శ్రీలంకలో ఉన్నప్పటికీ.. తెలంగాణలో… చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలపై స్పందించారు. విద్యార్థులు… మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. ఎంతైనా పాల్ రాజకీయంగా… వినోదాత్మకంగా వ్యవహరించినప్పటికీ.. అంతర్జాతీయంగా.. ఆయన ఇమేజ్.. ఆయనకు ఇలాగే ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.