కేఏ పాల్ కామెంట్స్ గమ్మత్తుగా వుంటాయి. ఆయన చాలా సీరియస్ గా మాట్లాడుతుంటారు కానీ వినడానికి కామెడీగా అనిపిస్తాయి. దీనికి కారణం కూడా ఆయన చెప్పే విషయాలన్నీ ఆవు పేడ వ్యాసంలానే వుంటాయి. ప్రపంచంలో ఏ టాపిక్ మాట్లాడినా సరే తిరిగి తిరిగి తన గొప్పదనం, ప్రపంచంలోని బిలినియర్స్, చారిటీ దగ్గరకి వచ్చి ఆగుతారు. అదే రిపీట్ కొడతారు.
తాజాగా ఆయన అల్లు అర్జున్ ఇష్యూ గురించి మాట్లాడారు. ఒకవేళ తాను అల్లు అర్జున్ అయితే ఏం చేసేవాడిని చెప్పారు. నేనే గనక అల్లు అర్జున్ అయితే.. రేవతి కుటుంబానికి, బంధువులకి క్షమాపణ చెప్పేవాడిని. పుష్ప కోసం తీసుకున్న మూడు వందల కోట్లు రేవతి కుటుంబానికి ఇచ్చేసేవాడిని. అస్తులని చారిటీకి రాసేవాడిని. ఇకపై చేసే సినిమాల్లో వచ్చేడబ్బు అంతా ప్రజా సేవ, గ్రామల అభివృద్ధిని వినియోగించేవాడిని.. ఇలా సాగిపోయింది ఏకే పాల్ ప్రెస్ మీట్.
ఇదే ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై కూడ ఆయన ఓ విమర్శ చేశారు. ప్రెస్ ముందు మాట్లాడేటప్పు అల్లు అర్జున్ హావభావాలు సరిగ్గా లేవని ఆయన స్టయిల్ అనుకరిస్తూ ఎత్తిచూపారు కేఏ పాల్.
ఇదే సందర్భంలో మరో రెండేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పిన కేఏ పాల్.. పదవులు శాశ్వతం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ ఉచిత సలహాని కూడా ఇచ్చేశారు.