రాష్ట్రమంతా తిరుగుతా.. టీడీపీ, బీజేపీకి ఒక్క సీటు రానివ్వను అని లక్ష్మి పార్వతి చేసిన సవాల్ ఇంకా ట్రోలింగ్ లో ఉండగానే..ఆమెకు పోటీగా కేఏ పాల్ కూడా వచ్చేశారు. విశాఖలో జగన్ కు ఇదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. తాను తల్చకుంటే.. ఏపీలో జగన్ కు ఒక్క సీటు కూడా రానివ్వనని ప్రకటించారు. ఒరేయ్ జగన్ అని అనిపించుకోవద్దని హెచ్చంచారు. అంతే కాదు.. పవన్ కళ్యాణ్ మాట్లాడితే పొలిటికల్ స్పీచ్ అవుతుందని .. కానీ నేను మాట్లాడితే దైవ శాపమన్నారు. ఇప్పటికే ఏడుగురు పోయారు.. జాగ్రత్త అని కూడా జగన్ ను హెచ్చరించారు.
పాల్ కు ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఆమరణదీక్ష చేస్తే..పోలీసులు ఎత్తేశారు. ఇది ఆయనకు కోపం తెప్పించింది. విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డిని చెడామడా తిట్టేశారు. తనపై దాడికి పాల్పడ్డ సిఐ రామారావు , ఎస్ ఐ ని సస్పెండ్ చేయండి…లేదూ అంటే 24 గంటల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తాను.. పులివెందుల్లో కూడా జగన్ గెలవకుండా చేయగలనని హెచ్చరించారు. ఎంపీలందరూ రాజీనామా చేస్తే నెల రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చూస్తానన్నారు.
కేఏ పాల్ ను ఇప్పటికే ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు కానీ.. ఆయన ఇటీవల జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మఖ్యంగా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి..జగన్ కు అనుకూలంగా మాట్లాడారు. పేపర్ స్టేట్ మెంట్లు ఇచ్చారు. వీడియోలు విడుదల చేశారు. అయితే జగన్ మార్క్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో ఆయనకు తెలిసిపోయిందేమో కానీ.. అరేయ్ అనిపించుకోవద్దంటూ మాట్లాడుతున్నారు. లక్ష్మాపార్వితికి పోటీగా కేఏపాల్ రాజకీయాల్లో ఓ వేవ్ సృష్టిస్తున్నారు.