వైసీపీ కార్యకర్తలు కీచకులుగా మారినా చూస్తూ ఉంటామని.. నోటీసులు మాత్రమే ఇస్తామని పోలీసులు అనుకుంటే వారిని పక్కన పెట్టేసి.. సీియస్ గా పని చేసే వారితో పని చేయించుకుంటామని ప్రభుత్వం సిగ్నల్స్ పంపింది. వర్రా రవీంద్రెడ్డి అనే సోషల్ మీడియా కీచకుడ్ని అరెస్టు చేసి హాడావుడి చేసి41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. దీంతో పోలీసుల తీరుపై మరో సారి విమర్శలు ప్రారంభమయ్యాయి. వైసీపీ హయాంలో చేసిన పోలీసింగ్ ఏంటి.. ఇప్పుుడు చేస్తున్న పోలీసింగ్ ఏంటి అన్న చర్చ ప్రారంభమయింది.
కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరగడంతో వెంటనే డీజీపీ కడప ఎస్పీని బదిలీ చేశారు. వర్ర రవీంద్రారెడ్డిని వదిలేసిన సీఐకు నోటీసులు ఇచ్చారు. వర్రా రవీంద్రారెడ్డిపై చాలా కేసులు కేసులు ఉన్నాయి. విజయమ్మ,షర్మిల,సునీతను కూడా దూషించారు. రంకులు అంటగట్టారు. ఆయన సోషల్ మీడియా పేజీలన్నీ జుగుప్సాకరంగా ఉంటాయి. అలాంటి వ్యక్తిని అలా వదిలేయడం ఏమిటన్న అభిప్రాయం వినిపించింది. కడప ఎస్పీ ఏ మాత్రం ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోలేదని నిర్దారించి బదిలీ చేశారు. హెడ్ క్వార్టర్ లో రిపోర్టు చేయమని చెప్పారు.
పోలీసుల తీరుపై పవన్ కల్యాణ్ అసంతృప్తితో ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా కుటుంబాలను కించ పరుస్తున్నా .. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కొంత మంది పోలీసులు మారలేదు. కడప ఎస్పీ వేటుతో ప్రభుత్వం .. తమ విధానమేంటో సిగ్నల్స్ ఇచ్చింది. ఇక పోలీసులు తమ సమర్థత చూపించుకోవడమే మిగిలింది. లేకపోతే ప్రభుత్వం సమర్థుల్ని వెదుక్కునే అవకాశం ఉంది.