జగన్ రెడ్డి పరువు పోయింది. మామూలుగా పోలేదు. తన పరువుగా ఫీలయ్యే లీడర్ ను.. ఓ సీఐ చొక్కా పట్టుకుని లాక్కుపోయాడు. స్టేషన్ వేసి కుమ్మేసిన ఉంటాడు. ఆ లీడర్ పేరు సుదర్శన్ రెడ్డి. లాయర్ అని చెప్పుకుంటాడు కానీ ఎప్పుడూ కోర్టులో వాదించలేదు. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా చెలామణి అవుతూ. ..దోపిడీలు, దౌర్జన్యాలు చేయడమే హక్కుగా ఫీలవుతూంటాడు.
ఇతను జగన్ రెడ్డికి ఎందుకు పరువు లాంటోడు అంటే.. ఈ లాయర్ లాయర్ ను డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పదవిలో జగన్ నియమించారు. ఈ పదవి చాలా కీలకం. ఓ రకంగా అడ్వకేట్ జనరల్ అంత పదవి. దీనికి అప్పటి వరకూ గాలివీడు మండలానికి చెందిన ఎంపీపీగా ఉన్న ఆయనకు ఆ పదవిలో నియమించారు జగన్. ఆయనకు ఏ విధంగానూ అర్హత లేదని కోర్టుల్లో కేసులు పడ్డాయి. అయితే ప్రజాధనమే కదా అని ప్రతీ దానికి జగన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లినట్లుగా ఈయన కేసులోనూ వెళ్లారు. చివరికి సుప్రీంకోర్టు కూడా సమర్థించలేదు. దాంతో ఆయన ఆ పదవిలో కోర్టులు కొట్టి వేసే వరకే ఉన్నారు .
ఓ మండల లీడర్ కు జగన్ రెడ్డి ఇంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర స్థాయి లో అదీ కూడా నిపుణుల్ని నియమించాల్సిన పదవిలో నియమించారంటే చిన్న విషయం కాదు. తన పరువుగా భావించి నియమించారు. ఇప్పుడా సుదర్శన్ రెడ్డిని అంకుశంలో రామిరెడ్డిని తీసుకెళ్లినట్లుగా పోలీసులు తీసుకెళ్లారు. ఇది జగన్ రెడ్డి పరువును కడప నడిబొడ్జున తీసేసినట్లయింది. ఆయన పరపతి కడపలో ఘోరంగా పడిపోతుందనడానికి ఇంత కన్నా నిదర్శనం ఎముంటుందని జోకులేసుకుంటున్నారు ఆయన చుట్టూ ఉండేవాళ్లు.