కాజల్ కెరీర్‌తో అప్ అండ్ డౌన్స్ ఓ ఆట ఆడుకొన్నా0యి. చటుక్కొన ఓ హిట్టుకొట్టిన ఆనందం పుటుక్కున ఓ ఫ్లాప్ పట్టుకెళ్లిపోయేది. కాజల్ తన అందచందాలతో, నటనతో ఎంతగా రాణించినా లాభం లేకుండా పోతోంది. దానికి తోడు వరుసగా అందుకొన్న భారీ ఫ్లాప్స్ కాజల్ కెరీర్‌ని అగాథంలోకి తోసేస్తున్నాయి. ఈ వేసవిలో కాజల్ సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం చిత్రాలతో ముందుకొచ్చింది. ఆ రెండు సినిమాలూ ఫ్లాప్స్ మూగట్టుకొన్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకొన్న హిందీ మూవీ దో లబ్జోంకీ కహానీ.. కూడా ఫ్లాప్ అయిపోయింది. పాపం.. ఆ సినిమా కోసం కాజల్ కాస్త శ్రుతిమించి ఘాటైన లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. ఆ ముద్దు కూడా కాజల్ ని కాపాడలేకపోయింది. దానికి తోడు.. కాజల్ పెర్ఫార్మ్సెన్స్కు మైనస్ మార్కులు పడ్డాయి. అంధురాలిగా కాజల్ మెప్పించలేకపోయిందని అక్కడి విమర్శకులు కాజల్‌ని ఏకిపారేస్తున్నారు.
ఈ ఫ్లాపులతో కాజల్ కెరీర్ కి దాదాపు పుల్‌స్టాప్ పడిపోయినట్టే అని చిత్రసీమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలుగులోనే కాదు, తమిళంలోనూ నవతరం కథానాయికల జోరు నడుస్తోంది. ఈదశలో హ్యాట్రిక్ ఫ్లాపులు కొట్టింది. దానికి తోడు కాజల్ వయసు కూడా 30పైనే. అటు వయసు భారం, ఇటు పరాజయ భారం ఇవన్నీ కాజల్‌ని తిరోగమన దిశలో ప్రయాణించేలా చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ కాజల్‌లో ఆత్మవిశ్వాసం తగ్గడం లేదు. ‘ఒక్క హిట్టు రాకపోతుందా..’ అని ఆశగా ఎదురుచూస్తోంది. హిట్టు మాట సరే.. ముందు ఎవరైనా సినిమా ఛాన్స్ ఇవ్వాలి కదా.. అది చూడాలి ముందు.