గోపీచంద్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మొగుడు’ సిన్మా గుర్తుందా? అందులో ఢిల్లీ డాల్ తాప్సీ హీరోయిన్. కానీ, ముందు హీరోయిన్గా అనుకున్నది ఆమెను కాదట! ‘చందమామ’ కాజల్‌ని తీసుకోవాలని కృష్ణవంశీ భావించారని అప్పట్లో ఓ వార్త వినిపించింది. ఏమైందో ఏమో కానీ… గోపీచంద్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కుదరలేదు. ఆ తరవాత కూడా వీరిద్దరూ ఏ సినిమాలోనూ జంటగా నటించలేదు. ఇదంతా గతం. తాజాగా వర్తమానానికి వస్తే… గోపీచంద్, కాజల్ జంటను త్వరలో ప్రేక్షకులు తెరమీద చూడనున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కుమార్ సాయి అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్న ఈ సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్‌ని సెలెక్ట్ చేశారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. కథానాయికగా కాజల్ అగర్వాల్ తన ప్రయాణం ప్రారంభించి పదేళ్లు దాటింది. కథానాయకుడిగా గోపీచంద్ కూడా పదేళ్లుగా దాటింది. ఇప్పటికి వీళ్ల కాంబినేషన్ కుదిరింది. ఇంతకు ముందు అనుష్క, ప్రియమణి, రకుల్, రాశి ఖన్నా వంటి స్టార్ హీరోయిన్లతో నటించిన గోపీచంద్ ఇప్పటివరకూ కాజల్‌తో నటించలేదు. కొన్ని కాంబినేషన్స్ కుదరాలంటే టైమ్ రావాలంతే.