ఈనెల 9 నుంచి `ఆచార్య` షూటింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం సన్నాహాలు మొదలెట్టేసింది. చిరు, చరణ్‌లు సెట్లో అడుగుపెట్టడం కాస్త ఆలస్యం అవుతుందని సమాచారం. మరోవైపు.. కాజల్‌కి ఇటీవలే పెళ్లయ్యింది. తను ఆ హడావుడిలో ఉంది. దాంతో కాజల్ కూడా సెట్లో అడుగుపెట్టడం కష్టం అనుకున్నారంతా. కానీ.. కాజల్ `ఆచార్య`కు కాల్షీట్లు ఇచ్చిందట. ఈ నెలలోనే కాజల్ `ఆచార్య` షూటింగ్లో పాల్గొనబోతోందని తెలుస్తోంది. భర్త గౌతమ్ తో కలిసి కాజల్ హైదరాబాద్ వస్తుందని, `ఆచార్య` షూటింగ్ లో పాల్గొనడంతో పాటుగా.. ఇక్కడి తన స్నేహితులకు ఓ పార్టీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోనే కాజల్ పై తెరకెక్కించాల్సిన సన్నివేశాలన్నీ పూర్తి చేయబోతున్నార్ట. మరోవైపు `ఇండియన్ 2`లోనూ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ డైలామాలో పడింది. దాంతో.. కాజల్ `ఆచార్య`కు కాల్షీట్లు ఇవ్వగలిగింది. `ఆచార్య` షూటింగ్ అవ్వగానే కాజల్ హనీమూన్‌కి వెళ్లబోతోందట.