కాజల్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని, గౌతమ్ అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకోబోతోందని ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. దీనిపై కాజల్ స్పందించింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. అక్టోబరు 30న పెళ్లికి ముహూర్తంగా నిర్ణయించారని తెలిపింది. ముంబైలో అతి తక్కువమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య సింపుల్ గా తన పెళ్లి జరగబోతున్నట్టు తీపి కబురు చెప్పేసింది. కరోనా లాంటి క్లిషమైన పరిస్థితుల్లో సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నా – ఈ మూమెంట్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోందని కాజల్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి తరవాత కూడా సినిమాల్లో నటిస్తానన్న భరోసాని తన అభిమానులకు కలిగించింది కాజల్. ప్రస్తుతం `ఆచార్య`తో పాటు విష్ణు సినిమా `మోసగాళ్లు`లోనూ నటిస్తోంది కాజల్.